ఇకనైనా నోర్లు తెరవండి…టాలీవుడ్‌ హీరోల‌కు వర్మ డిమాండ్‌.

January 4, 2022

ఇకనైనా నోర్లు తెరవండి…టాలీవుడ్‌ హీరోల‌కు వర్మ డిమాండ్‌.

RamGopalVarma:ఆంధ్రప్రదేశ్‌లోని థియేటర్స్‌లో టికెట్‌ ధరల గురించి ఇష్యూష్‌ నడుస్తున్న విషయం అందిరికీ తెలిసిందే. ఆ రాష్ట్రంలోని టికెట్‌ ధరల విషయంపై టాలీవుడ్‌ ఇండస్ట్రీ గుర్రున ఉంది. అయితే ఈ టికెట్‌ ధరల విషయంలో రామ్‌గోపాల్‌ వర్మ ఏపీ ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్నీనానికి సోషల్‌మీడియా ద్వారా చురకలు అంటించారు రామ్‌గోపాల్‌ వర్మ. ఇక వీలైనన్నీ ట్విట్స్‌ వేసి…ఫైనల్‌గా ‘‘ఇది నా రిక్వెస్ట్‌ కాదు…ఫిల్మ్‌ ఇండస్ట్రీకి చెందిన నా సహ ఉద్యోగులందరినీ డిమాండ్‌ చేస్తున్నా..ఇప్పటికైనా సినిమా టికెట్‌ ధరల విషయంలో నోరు తెరవండి. ఇప్పుడు నోర్లు మూసుకుంటే ఇంకేప్పుడు తెరవలేరు..తరువాత మీ ఖర్మ’ అని ట్విట్‌ చేశారు వర్మ. అయితే ఇప్పటికే టికెట్‌ ధరల విషయంలో చిరంజీవి, పవన్‌ కల్యాణ్, నాని, నిఖిల్, బాలకృష్ణ వంటివారు మాట్లాడారు. కానీ మిగతా హీరోలు మౌనం పాటిస్తున్నారు. ఇక నిర్మాతలు అయితే ఏం మాట్లాడితే ఏం వస్తుందో అని నోరు మెదపడం లేదు. మరి..రామ్‌గోపాల్‌ వర్మ కదలికతోనైన ఇండస్ట్రీ హీరోలు టికెట్‌ ఇష్యూస్‌పై మాట్లాడతారా? లేదా లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.

  

ట్రెండింగ్ వార్తలు