అయోమ‌యంలో గ‌ని! 

January 5, 2022

అయోమ‌యంలో గ‌ని! 

Varuntej Ghani: 2021 జూలై 30… ఈ తేదీకి రావాల్సిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వాయిదా పడుతుందని తెలుసుకున్న వరుణ్‌తేజ్‌ ‘గని’ టీమ్‌…అదే రోజున గని సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ 2021 జూలై 30నే ‘రాధేశ్యామ్‌’ ను విడుదల చేస్తున్నట్లు ప్రభాస్‌ అండ్‌ టీమ్‌ ప్రకటించగానే వరుణ్‌తేజ్‌ నిరాశపడిపోయాడు. రాధేశ్యామ్‌ ప్యాన్‌ ఇండియా మూవీ కాబట్టి చేసేదేమి లేక తన సినిమాను డిసెంబరు 03కి వాయిదా వేసుకున్నాడు. కానీ ఇక్కడ సీన్‌లోకి బాలకృష్ణ వచ్చారు. డిసెంబరు 02న ‘అఖండ’ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మళ్లీ వరుణ్‌ ఏం చేయాలో తెలియక తన సినిమాను మార్చి 18కి వాయిదా వేశాడు. కానీ ఇప్పుడు ప్రభాస్‌ ‘రాధే శ్యామ్‌’ సినిమాను మార్చి 18న విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. దాంతో వరుణ్‌ ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఏప్రిల్‌ ఖాళీ లేదు. మేలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదు. ఎలాగు రాధేశ్యామ్ రిలీజ్ వాయిదా ప‌డింది కాబ‌ట్టి జ‌న‌వ‌రి14న వ‌స్తే ఎలా ఉంటుంది అని ప‌రిశీలిస్తున్నారు మేక‌ర్స్‌. ఈ పరిస్థితుల్లో వరుణ్‌ తేజ్‌ ‘గని’ సినిమా రిలీజ్‌ మరోసారి అయోమయంలో పడింది.

Also Read: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు క్షమాపణలు సరిపోవు

ట్రెండింగ్ వార్తలు