June 5, 2024
ప్రముఖ జ్యోతిష్యులుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను జాతకాలు చెప్పనని ఈయన సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఒక వీడియో వైరల్ గా మారింది. ఇటీవల కాలంలో వేణు స్వామి సినిమా సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలని చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు.
ఈ క్రమంలోనే కొన్నిసార్లు ఈయన చెప్పినటువంటి జాతకం తప్పు కావడంతో భారీ స్థాయిలో ఈయనపై విమర్శలు వచ్చాయి. అయితే ఆ విమర్శలు అన్నింటిని ఎదుర్కొన్నారు. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల గురించి కూడా వేణు స్వామి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఓటమి పాలవుతుందని తెలియజేయగా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఈయన చెప్పారు. అలాగే కేంద్రంలో మోడీ హవా తగ్గుతుందని కూడా చెప్పారు.
ఇక ఈయన చెప్పిన జాతకం ప్రకారం నరేంద్ర మోడీ కాస్త మెజారిటీ తగ్గింది.కానీ జగన్ మోహన్ రెడ్డి సీఎం అవుతారని బల్ల గుద్ది చెప్పినటువంటి ఈయన జాతకం తప్పయింది. జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయం అందుకున్నారు. దీంతో ఈయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని విడుదల చేశారు. నేను చెప్పినటువంటి జాతకం 100% తప్పు అయింది ఈ విషయాన్ని నేను ఒప్పుకుంటున్నాను అందుకే ఇకపై సోషల్ మీడియాలో ఎక్కడ కూడా తాను సినిమా సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలు చెప్పనని వెల్లడించారు.
ఇలా ఏపీ ఎన్నికల ఫలితాల విషయంలో నేను చెప్పిన జాతకం 100% నిజం కావడంతో చాలామంది నన్ను విమర్శిస్తున్నారు. ఇకపై ఇలాంటి విమర్శలకు తావు లేకుండా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో ఏ వ్యక్తి వ్యక్తిగత జీవితం గురించి తాను మాట్లాడానని వేణు స్వామి షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read More: పవన్ విజయంపై రియాక్ట్ అయిన అల్లు అర్జున్.. ట్వీట్ వైరల్!