ట్రోల్స్ వల్ల నాకు పని బాగా పెరిగింది.. ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన వేణు స్వామి!

June 20, 2024

ట్రోల్స్ వల్ల నాకు పని బాగా పెరిగింది.. ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన వేణు స్వామి!

వేణు స్వామి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ట్రోల్స్ ఎదుర్కొంటూ వివాదాలలో నిలుస్తున్నారు. ఈయన ఇప్పటివరకు ఎంతో మంది సినిమా సెలబ్రిటీలు రాజకీయ నాయకుల జాతకాలని చెబుతూ వార్తలలో నిలిచారు. అయితే ఈయన చెప్పిన కొన్ని జాతకాలు నిజం కాలేదు. దీంతో ఈయనని భారీ స్థాయిలో ట్రోల్స్ చేశారు. ఇక వేణు స్వామి చెప్పిన జాతకాలు కొందరి విషయంలో నిజమయ్యాయి కానీ కొందరి విషయంలో నిజం కాలేదు ముఖ్యంగా ఏపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విషయంలో ఈయన చెప్పిన జాతకం పూర్తిగా తప్పు అయింది.

ఈ విధంగా వేణు స్వామి చెప్పిన జాతకం నిజం కాకపోవడంతో సోషల్ మీడియా వేదికగా ఈయనకు ట్రోల్స్ అధికమయ్యాయి. అయితే జగన్ ఓటమి తర్వాత ఈయన ఒక వీడియోని షేర్ చేశారు. అందులో భాగంగా ఇకపై తాను ఏ సినిమా సెలబ్రెటీ గురించి రాజకీయ నాయకుడి గురించి జాతకాలు సోషల్ మీడియా వేదికగా చెప్పానని వెల్లడించారు. అయినప్పటికీ ఈయన పై ట్రోల్స్ ఆగడం లేదు. ఈ క్రమంలోనే తన గురించి వస్తున్న ట్రోల్స్ పై వేణు స్వామి స్పందించారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత నాపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. ఈ ట్రోలింగ్ నాకేమీ కొత్తకాదు. అలాగే నేను దేవుడిని కాదు. నేను చెప్పిన వాటిలో 100 కి 98, 99 శాతం నిజం అయ్యాయి. అది నా సక్సెస్ రేట్. ఎన్నికల ఫలితాల విషయంలో నా జ్యోతిష్యం నిజం కాలేకపోయింది.. ఆ విషయాన్ని కూడా నేను ఒప్పుకున్నాను అని తెలిపారు.. ఈ విషయంలో ఎంతోమంది పెద్దపెద్ద ప్రముఖుల ప్లేటు కేటాయించారు కానీ వేణు స్వామి ఆలా కాదు వేణు స్వామికి సబ్జెక్టు అనేది ఉందంటూ ఈయన తెలిపారు. ఇక మీరు నన్ను ట్రోల్ చేసినంత మాత్రాన నేను భయపడను.

నేను ఈ విజయం పూల పాన్పు పై అందుకోలేదు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. ఇక మీరు ఎంత ట్రోల్ చేస్తే నాకు అంత పని పెరుగుతుందని నేను అంత పాపులర్ అవుతున్నానని తెలిపారు. అయితే నన్ను ట్రోల్ చేసిన వారిపై కూడా అమ్మవారి కరుణ కటాక్షాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటూ వేణు స్వామి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: చరణ్ వద్ద పవన్ అప్పు చేశారా.. వడ్డీలు కూడా కడతానని చెప్పారా?

ట్రెండింగ్ వార్తలు