పవన్ నాలుగో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసిన వేణు స్వామి.. సంచలనం రేపుతున్న కామెంట్స్?

June 3, 2024

పవన్ నాలుగో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసిన వేణు స్వామి.. సంచలనం రేపుతున్న కామెంట్స్?

సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో తరచు వార్తలలో నిలుస్తున్నారు. ఈయన రాజకీయాలలో బిజీగా ఉంటూ గత కొంతకాలంగా సినిమాలకు కాస్త దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఎన్నికలలో భాగంగా ఈయన పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి దిగారు. ఇక ఈ ఎన్నికలలో గెలుస్తారని ధీమాతో పవన్ కళ్యాణ్ ఉన్నారు.

ఇక ఈ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటలలో రాబోతున్నాయి అయితే ఈయన వృత్తిపరమైన విషయాలను పక్కన పెడితే వ్యక్తిగత విషయాల ద్వారా కూడా వార్తలలో నిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

గతంలో కూడా వేణు స్వామి పవన్ కళ్యాణ్ జాతకం గురించి మాట్లాడుతూ ఆయన జాతకంలో నాలుగో పెళ్లి రాసి ఉందని తెలిపారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లికి ఏకంగా ముహూర్తం ఖరారు చేస్తూ చేసినటువంటి కామెంట్స్ సంచలనం అవుతున్నాయి.

త్వరలోనే పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి కూడా పిఠాపురం అవుతుందని ఈయన నాలుగో పెళ్లి కూడా చేసుకోబోతున్నారనీ వేణు స్వామి తెలిపారు అయితే ఆ పెళ్లి ఎప్పుడో కాదని 2024 చివరిలో తన నాలుగో పెళ్లి జరగబోతుంది అంటూ వేణు స్వామి ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. ఇలా పవన్ నాలుగో పెళ్లి గురించి వేణు స్వామి ముహూర్తంతో సహా చెప్పడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

ఇక పవన్ రాజకీయాల గురించి కూడా వేణు స్వామి పలు సందర్భాలలో వెల్లడించారు పవన్ కళ్యాణ్ జాతకంలో అసలు రాజకీయయోగం లేదని ఆయన ముఖ్యమంత్రి కావడం అసలు జరగదని తెలిపారు. ఇక ఈయన రాజకీయాలలో కంటే సినిమాలలోనే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారని వేణు స్వామి పవన్ కళ్యాణ్ జాతకం గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Read More: తిరిగి ప్రారంభంకానున్న షూటింగ్‌..ఆందోళ‌న‌లో ప‌వ‌న్ ఫ్యాన్స్‌

ట్రెండింగ్ వార్తలు