న‌య‌నతార, విఘ్నేశ్ శివన్ న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్..ఎక్క‌డంటే…?

January 2, 2022

న‌య‌నతార, విఘ్నేశ్ శివన్ న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్..ఎక్క‌డంటే…?

Vignesh Shivan and Nayanthara: లేడి సూప‌ర్‌స్టార్‌ నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. నానూ రౌడీదాన్‌ చిత్ర షూటింగ్‌ సమయంలో ప్రేమలో పడ్డ ఈ జంట అప్పటి నుంచి సహజీవనం చేస్తున్నారు. కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ఈ జంట మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కారు. న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ కోసం వీరు దుబాయ్ వెళ్లారు. అక్కడ బూర్జ్‌ ఖలీఫా ప్రాంతంలో నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ఈ జంట మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో 2021 తమకు సక్సెస్‌ ఫుల్‌ సంవత్సరంగా అమరిందని, తమ రౌడీ పిక్చర్స్‌ పతాకంపై నిర్మించిన కూళంగగల్‌ చిత్రం ఆస్కార్‌ అవార్డుల బరిలో నామినేట్‌ అవడం, తాము విడుదల చేసిన రాఖీ చిత్రం విజయవంతం కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

సినిమాల విషయానికి వస్తే వీరిద్దరూ కలిసి నిర్మించిన రాకీ చిత్రానికి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించారు. ఇందులో వసంత్ రవి, భారతీరాజా జంటగా నటించారు. మరోవైపు ‘కాతు వాకుల రెండు కాదల్’ సినిమాతో విఘ్నేశ్ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నయనతార, సమంత నటిస్తున్నారు.

https://www.instagram.com/reel/CYLXtgCJv3P/?utm_source=ig_web_copy_link

ట్రెండింగ్ వార్తలు