అలాంటి కఠిన నిర్ణయం తీసుకున్న హీరో విజయ్ ఆంటోని.. జీవితాంతం చెప్పులు వేసుకోనంటూ!

May 30, 2024

అలాంటి కఠిన నిర్ణయం తీసుకున్న హీరో విజయ్ ఆంటోని.. జీవితాంతం చెప్పులు వేసుకోనంటూ!

మామూలుగా మనం బయటికి వెళ్లినప్పుడు చెప్పులు లేకుండా తిరగడం అన్నది అసంభవం. కొందరు బాగా డబ్బు ఉన్నవాళ్లు అయితే ఇంట్లోనే చెప్పులు వేసుకుని తిరుగుతూ ఉంటారు. కేవలం కొన్ని కొన్ని సందర్భాలలో మాత్రమే మనం చెప్పులు విడిచి పాదాలతో నడుస్తూ ఉంటాము. కానీ ఎప్పటికీ చెప్పులు వేసుకోకుండా అలాగే ఉన్న వారు చాలా తక్కువ మందే ఉంటారు. చెప్పులు లేకుండా నడవడం అన్నది చాలా కష్టమైన పని. కానీ ఒక హీరో జీవితాంతం చెప్పులు వేసుకోకూడదని ఫిక్స్ అయ్యాడట. ఇంతకీ ఆ హీరో ఎవరు?

ఆ హీరో ఎందుకు అంత కఠిన నిర్ణయం తీసుకున్నారు అన్న వివరాల్లోకి వెళితే.. ఆ హీరో మరెవరో కాదు హీరో విజయ్ ఆంటోనీ. తెలుగులో బిచ్చగాడు సినిమాతో భారీగా పాపులారిటీని ఏర్పరచుకున్నారు విజయ్. ఈ సినిమాతో తెలుగులో భారీగా అభిమానులను సంపాదించుకోవడంతో తన ప్రతి ఒక సినిమాను తెలుగులో విడుదల చేస్తూ వచ్చారు. అందులో భాగంగానే ఇటీవల బిచ్చగాడు 2, లవ్ గురు సినిమాలతో తెలుగులో కూడా మంచి విజయం సాధించాడు. త్వరలో తుఫాన్ అనే సినిమాతో రాబోతున్నాడు విజయ్ ఆంటోనీ. తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా ఈ ఈవెంట్లో ఆంటోని చెప్పులు లేకుండా కనపడ్డారు. ఇదే విషయం గురించి రిపోర్టర్లు ప్రశ్నించగా విజయ్ ఆంటోని మాట్లాడుతూ..

చెప్పులు లేకుండా బాగానే ఉంది. మొదట్లో కొంచెం పెయిన్ ఉంటుంది. ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది. ఆరోగ్యానికి కూడా మంచిదే. జీవితాంతం ఇలాగే చెప్పులు లేకుండా ఉండాలని ఫిక్స్ అయ్యాను, కావాలంటే మీరు కూడా ట్రై చేయండి అని తెలిపారు విజయ్. ఈ సందర్భంగా విజయ్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే విజయ్ చేస్తున్న పనికి అభిమానులు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఒక హీరో అయ్యి ఉండి ఇలా చెప్పులు లేకుండా తిరగడం అన్నది నిజంగా చాలా గ్రేట్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Read More: త్రివిక్రమ్ లేకపోతే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా లేదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్ కృష్ణ చైతన్య?

ట్రెండింగ్ వార్తలు