ప్ర‌భాస్‌కు నాకు మ‌ధ్య ఆ పోటీ లేదు..విజయ్ దేవరకొండ కామెంట్స్ వైర‌ల్‌

July 1, 2024

ప్ర‌భాస్‌కు నాకు మ‌ధ్య ఆ పోటీ లేదు..విజయ్ దేవరకొండ కామెంట్స్ వైర‌ల్‌

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు విజయ్ దేవరకొండ ఒకరు. కెరియర్ మొదట్లో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలలో నటిస్తున్న ఈయన పెళ్లి చూపులు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు హీరోగా పరిచయమయ్యారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అనంతరం అర్జున్ రెడ్డి గీతగోవిందం వంటి వరుసటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇక ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాలో అర్జునుడి పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలో విజయ్ నటనకు ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటించడంతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ కి విజయ్ దేవరకొండ లక్కీగా మారిపోయారని అందుకే ఆయన చేసే సినిమాలలో తప్పకుండా విజయ్ దేవరకొండ ఉంటున్నారంటూ వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలోనే ఇటీవల ఈ సినిమా కార్యక్రమంలో భాగంగా రిపోర్టర్ సైతం విజయ్ దేవరకొండను ఇదే ప్రశ్న వేశారు. మీరు డైరెక్టర్ కు లక్కీగా మారిపోయారని అందుకే మీకు అవకాశం కల్పించారంటూ వార్తలు వస్తున్నాయి దీనిపై రియాక్షన్ అని అడగగా విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. నేను నాగీకి లక్కీ కాదు కేవలం ప్రభాస్ అన్న కోసం, నాగి కోసమే ఈ సినిమాలో నటించానని తెలిపారు.

కల్కి సినిమా చాలా అద్భుతంగా ఉంది అందుకే మంచి సక్సెస్ అయింది ఇందులో మనం చేసింది ఏమీ లేదు అంటూ సమాధానం చెప్పారు. ఒకరోజు నాగి షూటింగ్ కి రమ్మని పిలిచారు. అక్కడికి వెళ్తే అర్జునుడి పాత్రలో నటించమని కోరారు దాంతో తాను నటించానని అయితే ఇది ప్రభాస్ అన్న కోసం చేశానే తప్ప కర్ణుడు అర్జునుడు వంటి పోటీ మా మధ్య లేదు అంటూ ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి

ట్రెండింగ్ వార్తలు