August 24, 2022
బాలీవుడ్‌లో నెపోటిజమ్ గురించి అప్పుడప్పుడు చర్చలు జరుగుతూనే ఉంటాయి. వివాదాస్పదమైన కామెంట్స్ వినిపిస్తూనే ఉంటాయి. లేటెస్ట్‌గా బాలీవుడ్ స్టార్ హారోయిన్ ఆలియాభట్ చేసిన వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. భర్త రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆలియాభట్ బ్రహ్మాస్త్ర అనే ట్రయాలజీ ఫిల్మ్ చేశారు. ఈ సినిమా సెప్టెంబరు 9న దేశవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ తరుణంలో బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆలియాభట్ నెపోటిజమ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
‘‘నేను కావాలని భట్ ఫ్యామిలీలోనే పుట్టాలని కోరుకోలేదు. అది దైవనిర్ణయం. భట్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ నాకు బలమే కావొచ్చు. కానీ ఓ నటిగా నేనెంటో నా నటనతో, నా సినిమాలతో నేనునిరూపించు కునున్నాను. నెపోటిజమ్ (బంధుప్రీతి) గురించి చర్చ వచ్చిన ప్రతిసారి నేను నా మాటలతో నా ప్రతిభను నిరూపించుకోలేను. నేనునచ్చితే నా సినిమాలను చూడండి. లేకపోతే చూడొద్దు. అంతేకానీ ప్రతిసారి రాద్దాంతం చేయవద్దు’ అని ఆలియాభట్ కొంచెం ఘాటూగానే వ్యాఖ్యలు చేశారు.
ఆలియాభట్‌యే కాదు..గతంలో ‘ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పలేం. నచ్చినవారు సినిమా చూస్తారు. నచ్చనివారు చూడరు’ అని కరీనాకపూర్, ‘పీకే’ రిలీజ్ సమయంలో ‘‘నచ్చినవాళ్లు సినిమా చూస్తారు. లేకపోతే లేదు’ అని ఆమిర్‌ఖాన్ తమదైన స్టైల్లో స్టేట్‌మెంట్స్ పాస్ చేశారు.
రీసెంట్‌గా ‘లైగర్’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న విజయ్ దేవరకొండ కూడా బాయ్‌కాట్ లైగర్ గురించి ఇదే రితీలో మాట్లాడారు. ‘‘నచ్చిన వారు థియేటర్స్‌లో చూస్తారు. మిగిలినవారు ఫోన్స్‌లో, టీవీల్లో చూస్తారు. అంతేకానీ బాయ్‌కాట్ లైగర్ అనే ప్రతివారి గురించి పట్టించుకోవాల్సిన పనిలేదు’’ అన్నట్లుగా విజయ్ సమాధానం చెప్పడం నెటిజన్లకు నచ్చలేదు. అసలే బాలీవుడ్‌లో సినిమాలు అంతంత మాత్రంగా ఉంటున్న ఈ సమయంలో తారలు ఇలాంటి కామెంట్స్ చేయడం మాత్రం ప్రతి ఇండస్ట్రీలో ఓ హాట్‌టాపిక్‌గా మారింది.