జంటగా కల్కి సినిమా చూసిన విజయ్ రష్మిక..మ‌రోసారి దొరికిపోయారుగా?

July 1, 2024

జంటగా కల్కి సినిమా చూసిన విజయ్ రష్మిక..మ‌రోసారి దొరికిపోయారుగా?

Kalki 2898 AD: సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ రష్మిక జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ కలిసి డియర్ కామ్రేడ్ గీతాగోవిందం అంటే సినిమాలలో నటించారు అయితే ఈ సినిమాల తర్వాత వీరిద్దరి మధ్య ఏదో ఉందంటు తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇలా పలు సందర్భాలలో వీరిద్దరూ కూడా వారి రిలేషన్ పై సందేహాలు వచ్చేలాగే వ్యవహరిస్తూ ఉన్నారు.

రష్మిక విజయ్ దేవరకొండ గురించి ఇలాంటి రూమర్స్ వచ్చినప్పటికీ వీరిద్దరూ ఈ రూమర్లపై స్పందించి ఖండించిన సందర్భాలు లేవు. ఇక వీరిద్దరూ ఎంచక్కా కలిసి వెకేషన్ లకి వెళ్లడం అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో ఎన్నో సందర్భాలలో బయటపడ్డారు. అయితే తాజాగా మరోసారి వీరిద్దరూ కలిసి కల్కి సినిమాని జంటగా చూసారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఒకేసారి సోషల్ మీడియా వేదికగా కల్కి సినిమా గురించి పోస్టులు చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

కల్కి సినిమాలో విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసింది. అయితే ఈ సినిమాని ఈయన థియేటర్లో చూసారని,ఇప్పుడే సినిమా చూసి వచ్చాను. అసలు నాకు ఏం.. చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. ఇండియన్ సినిమాలో ఒక కొత్త లెవెల్ అన్ లాక్ అయింది. ఈ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించాలి అంటూ ఈయన కల్కి సినిమా గురించి ప్రశంసలు కురిపించారు.

ఈ క్రమంలోనే మరోవైపు రష్మిక సైతం కల్కి సినిమా చూడడమే కాకుండా ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ చేసిన పోస్టు వైరల్ అవుతుంది. ఓ మై గాడ్. నాగ్ అశ్విన్.. మీరు ఒక జీనియస్. టీం మొత్తానికి.. నా అభినందనలు. మన మైథాలజికల్ దేవుళ్ళని వెండితెర మీద చూడటం చాలా సంతోషంగా అనిపించింది అంటూ రష్మిక చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇలా వీరిద్దరూ ఒకేసారి కల్కి సినిమా గురించి సోషల్ మీడియాలో పోస్టులు చేయడంతో ఇద్దరు కలిసి ఈ సినిమాని చూశారని వీరిద్దరి గురించి వస్తున్న డేటింగ్ వార్తలు కూడా నిజమేనని మరోసారి రుజువయింది

Related News

ట్రెండింగ్ వార్తలు