ఆ సినిమా విడుదల రోజు చాలా భయపడ్డాను.. విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్!

June 15, 2024

ఆ సినిమా విడుదల రోజు చాలా భయపడ్డాను.. విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్!

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అయితే విజయ్ దేవరకొండ నటించిన సినిమాలేవి కూడా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

ఇక ఈయన నటించిన గీతగోవిందం తర్వాత ఈ స్థాయిలో ఏ సినిమా కూడా సక్సెస్ అందించలేదని చెప్పాలి. ఇటీవల ఫ్యామిలీ స్టార్ సినిమా ద్వారా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండకు మరోసారి నిరాశ ఎదురయిందని చెప్పాలి. ప్రస్తుతం ఈయన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మరో సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉండగా తాజాగా విజయ్ దేవరకొండ తాను నటించిన డియర్ కామ్రేడ్ సినిమా గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గీత గోవిందం తర్వాత రష్మికతో కలిసి నటించిన చిత్రం డియర్ కామ్రేడ్ ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా థియేటర్లలో అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోయినప్పటికీ ఓటీటీ యూట్యూబ్ ఛానల్ లో మాత్రం అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది.

ఇకపోతే తాజాగా ఈ సినిమా యూట్యూబ్లో ఏకంగా నాలుగు వందల మిలియన్ వ్యూస్ క్రాస్ చేసుకుంది ఈ క్రమంలోనే ఈ విషయంపై విజయ్ దేవరకొండ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. డియర్ కామ్రేడ్ రిలీజ్ అయిన రోజున పడిన బాధ నుంచి ఇప్పటి వరకు మాకు అనంతమైన ప్రేమ దొరికింది.. డియర్ కామ్రేడ్ నాకు ఎంతో నచ్చిన సినిమా.. ఎంతో ఇష్టమైన కథ.. అని విజయ్ ఎమోషనల్ అయ్యారు.

Read More: అలాంటి సమస్యతో బాధపడుతున్న రవితేజ… మాకు స్ఫూర్తి అంటూ డైరెక్టర్ పోస్ట్!

ట్రెండింగ్ వార్తలు