April 1, 2024
విజయ్ దేవరకొండ త్వరలోనే ఫ్యామిలీ స్టార్ సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్న విజయ్ దేవరకొండ ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఇండస్ట్రీలో ఏర్పడే నెగెటివిటీ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి సెలబ్రిటీల గురించి ఎన్నో నెగటివ్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొందరి నెగిటివ్ వార్తలపై స్పందిస్తూ కామెంట్లు చేయగా మరి కొందరు అసలు వాటి గురించి పట్టించుకోరు. అయితే విజయ్ దేవరకొండను ప్రశ్నిస్తూ “మీరు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఈ నెగటివ్ ని ఏ విధంగా ఫేస్ చేస్తారు“ అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు విజయ్ దేవరకొండ సమాధానం చెబుతూ..
“నన్ను హీరో అవ్వమని ఎవరు కూడా చెప్పలేదు.. నేనే హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను.. ఇక్కడ మంచి సంఘటనలు అయినా లేదంటే నెగెటివ్ అయినా నేనే ఎదుర్కొంటానని.. మనం ఒక పని మొదలు పెడితే ప్రశంసించే వారి కన్నా విమర్శించే వారే ఎక్కువగా ఉంటారు వారిని పట్టించుకోకూడదు వాళ్లపని తిట్టడం మాత్రమే..“ అని చెప్పుకొచ్చారు.
“ఈ సమాజంలో ఒక సెలబ్రిటీలను మాత్రమే కాదు ఎవరైనా ఏదైనా ఒక మంచి పని చేస్తున్నారు అంటే వారిని ప్రశంసించడం పోయి నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తూ కామెంట్లు చేస్తుంటారు. కేవలం నా గురించి మాత్రమే కాదు ఒక గాంధీజీ గారిని, మోడీ గారిని చివరికి ఆ దేవుని కూడా తిడుతూ ఉంటారు. మనం మన జీవితంలో మంచి చెడు రెండింటిని తీసుకొని ముందుకు వెళ్లాలి. ఇలా నెగిటివిటీని కనుక ఎదుర్కో లేకపోతే ఇండస్ట్రీ నుంచి ఇంటికి వెళ్ళిపో ఎవరు కూడా నిన్ను ఆపరు నీ స్థానంలో మరో హీరో వస్తారు“ అంటూ ఈ రౌడీ హీరో చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.