April 3, 2024
విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా పరశురాం డైరెక్షన్లో వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతోంది. దీంతో ప్రమోషన్ల జోరు పెరిగింది. ఈ సందర్భంగా ఏప్రిల్ రెండో తారీఖున హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు మూవీ టీం. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడాడు.
కెరియర్ తొలినాళ్లలో తన సినిమా 100 కోట్లు కలెక్షన్లు సాధించాలని కలలు కన్నాను. ఆ కోరిక నా నాలుగవ సినిమా గీతాగోవిందం తోనే నెరవేరింది. అయితే గతంలో 200 కోట్లు సాధిస్తానని ఒక సినిమా సమయంలో చెప్పాను. అది జరగలేదు. అయితే అలా చెప్పటం నా పొగరు కాదు ఆత్మవిశ్వాసం. 200 కోట్లు కొడతానని చెప్పడం తప్పు కాదు కానీ అలా సాధించకపోవడం నా తప్పు కానీ ఏదో ఒక రోజు సాధిస్తాను.
తనపై తనకి నమ్మకం ఉందని, ప్రతిరోజు బెడ్ పై నుంచి లేచినప్పుడు అదే నమ్మకంతో లేస్తాను, అదే నమ్మకం తో పనికి వెళ్తాను. ఇక్కడ నిలబడటం కూడా అదే నమ్మకంతో నిలబడతాను. ఇంకొకరు స్టార్ అయినప్పుడు మనం స్టార్ అవ్వలేమా ఏంటి, ఇంకొకరు 200 కోట్లు కొడితే మనం కొట్టలేమా ఏంటి, నేను కొడితే మీలో ఎవరో ఒకరు మళ్ళీ కొట్టలేరా ఏంటి అంటూ క్రేజీ కామెంట్స్ తో ఉర్రూతలూగించాడు. 200 కోట్లు కలెక్షన్స్ సాధించేవరకు మీరు ఎంతైనా తిట్టండి నేను భరిస్తూనే ఉంటాను అని చెప్పారు విజయ్ దేవరకొండ.
ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం తనకు ఎలాంటి అవార్డులు వచ్చినా అవి దర్శకుడు పరుశురామ్ కాళ్ల దగ్గరికి వెళతాయి. తను లేకపోతే ఇలాంటి అవకాశం తన లైఫ్ లో ఉండేది కాదు అని ఎమోషనల్ అయ్యాడు. విజయ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్న సినిమా గీత గోవిందం. మళ్లీ ఇప్పుడు వాళ్లిద్దరి కాంబినేషన్ లోనే స్టార్ సినిమా వస్తూ ఉండటంతో ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Read More: ఆ దేశంలో విడుదల కాబోతున్న మొట్టమొదటి తెలుగు సినిమాగా ఫ్యామిలీ స్టార్ రికార్డ్?