అదిరిపోయిన విజయ్ కొత్త మూవీ అప్డేట్.. యోధుడిగా కనిపించబోతున్న రౌడీ బాయ్?

May 9, 2024

అదిరిపోయిన విజయ్ కొత్త మూవీ అప్డేట్.. యోధుడిగా కనిపించబోతున్న రౌడీ బాయ్?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి మనందరికీ తెలిసిందే. విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ పుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. గత ఏడాది ఖుషి సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్న విజయ్ 8 దేవరకొండ ఇటీవలే ఫ్యామిలీ స్టార్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. పరశురాం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మృణల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది. అలాగే ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.

విడుదలకు ముందే టీజర్, ట్రైలర్ తో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీకి రిలీజ్ రోజే కొన్ని మిక్స్డ్ రివ్యూస్ రావడంతో వసూళ్లపై ప్రభావం చూపించింది. ఇది ఇలా ఉంటే నేడు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో వరుసగా తన రాబోయే సినిమాల నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పటికే రవికిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో విజయ్ చేస్తున్న సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న VD12 సినిమా అప్డేట్ ఇచ్చారు. తాజాగా విజయ్ దేవరకొండ మరో సినిమా అప్డేట్ వచ్చింది.

గతంలో ట్యాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో మెప్పించిన దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో విజయ్ దేవరకొండ హీరోగా సినిమాని ప్రకటించారు. VD14 వర్కింగ్ టైటిల్ తో ఒక ఆసక్తికర పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఓ వీరుడి విగ్రహం ఉంది. శపించబడిన భూమి నుంచి వచ్చిన ఓ యోధుడి కథ అని దీని గురించి తెలిపారు. 1854 సంవత్సరం నుంచి 1873 సంవత్సరం మధ్యలో జరిగిన కథ అని పోస్టర్ పై వేశారు. ఇతిహాసాలు రాయలేదు, అవి యోధుల రక్తంలో ఇమిడిపోయాయి అని ఆసక్తికరంగా ఈ సినిమాని ప్రకటించారు. ఈ ఒక్క పోస్టర్ తోనే సినిమాపై భారీ అంచనాలు పెంచారు. విజయ్ దేవరకొండ రాజుల కాలంలో యోధుడిగా పీరియాడిక్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమాని కూడా పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు.

Read More: బర్త్ డే స్పెషల్.. తండేల్ నుంచి బిగ్ అప్డేట్.. వైరల్ అవుతున్న పోస్టర్!

Related News

ట్రెండింగ్ వార్తలు