అవార్డును అమ్మేసిన విజయ్ దేవరకొండ.. అంత కష్టం ఏమి వచ్చిందబ్బా?

April 3, 2024

అవార్డును అమ్మేసిన విజయ్ దేవరకొండ.. అంత కష్టం ఏమి వచ్చిందబ్బా?

సినీ ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు విజయ్ దేవరకొండ ఒకరు.ఈయన ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. త్వరలోనే పరశురాం దర్శకత్వంలో నటించిన ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈయన తనకు వచ్చినటువంటి ఒక అవార్డు అమ్మానని గుర్తు చేసుకున్నారు.

తనకు 2017వ సంవత్సరంలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో నటించినటువంటి అర్జున్ రెడ్డి సినిమాకుగాను 2018 సంవత్సరంలో ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్నటువంటి విజయ్ దేవరకొండ తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈ అవార్డును తాను అమ్ముకున్నాను అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి.

అవార్డును తాను ఐదు లక్షల రూపాయలకు వేలం పాట పెట్టగా అప్పట్లో దివి ల్యాబ్స్ కి చెందినటువంటి కుటుంబ సభ్యులలో ఒకరైనటువంటి శ్యామల దేవి అనే మహిళ 25 లక్షల రూపాయలకు ఈ అవార్డు వేలంపాటలో గెలుచుకున్నారు. ఇలా భారీ స్థాయిలో ఈ సినిమా అవార్డు అమ్ముడుపోవడంతో ఏకంగా ఈయన ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆ అవార్డును ఆమె చేతిలో పెట్టడమే కాకుండా ఆమె ఇచ్చిన 25 లక్షల రూపాయల డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్ కి పంపించారు. ఇక తనకు అవార్డులు అంటే పెద్దగా ఇష్టం ఉండదని అందుకే ఈ అవార్డులను అమ్మానని ఈయన తెలిపారు. ఇక ఈ అవార్డు అమ్మడంతో మరికొన్ని అవార్డ్స్ ఇంట్లో ఉన్నాయని మరికొన్ని ఆఫీసులో కూడా ఉన్నాయని ఈయన తెలిపారు.

Read More: పుష్ప 2 టీజర్ అప్డేట్… వైరల్ అవుతున్న లేటెస్ట్ పోస్టర్?

ట్రెండింగ్ వార్తలు