బీస్ట్ సినిమా న‌చ్చ‌లేద‌ని థియేట‌ర్‌కి నిప్పంటించిన అభిమానులు

April 13, 2022

బీస్ట్ సినిమా న‌చ్చ‌లేద‌ని థియేట‌ర్‌కి నిప్పంటించిన అభిమానులు

Vijay Fans Set Screens on Fire: త‌మ అభిమాన‌ హీరో సినిమా రిలీజవుతుంటే వారి అభిమానుల అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. సినిమా హిట్ట‌యితే పాలాభిషేకాలు, బాగోలేదంటే పోస్టర్లు చించడాలు, విమర్శలు సర్వసాధారణమే. కానీ విజయ్‌ ఫ్యాన్స్‌ మాత్రం హద్దు మీరి ప్రవర్తించారు. బీస్ట్‌ నచ్చకపోవడంతో ఏకంగా థియేటర్‌కే నిప్పంటించారు.

తమిళ స్టార్‌ విజయ్‌, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం బీస్ట్‌. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా గురువారం (ఏప్రిల్‌ 13న) రిలీజైంది. అయితే సినిమాకు బెనిఫిట్ షో నుండే నెగెటివ్‌ టాక్‌ స్టార్ట్‌ అయింది. సినిమా తాము ఊహించ‌నంత బాగా లేద‌ని అభిమానులు మండిపడుతున్నారు. ఎన్నో ఆశలతో థియేటర్‌కు వెళ్తే చివరికి నిరాశతో వెనుదిరిగి రావాల్సి వస్తోందంటూ దిగులుగా కామెంట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలో తమిళనాడులోని థియేటర్‌లో సినిమా చూస్తున్న కొందరు అభిమానులకు బీస్ట్‌ సినిమా నచ్చకపోవడంతో ఏకంగా స్క్రీన్‌కు నిప్పంటించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఎంత నచ్చకపోతే మాత్రం మరీ థియేటర్‌కు నిప్పంటిస్తారా? అని మండిపడుతున్నారు ఇత‌ర హీరోల అభిమానులు. మ‌రి చూడాలి ఈ వివాదం ఇంత‌టితో ఆగిపోతుందో లేదో…

ఇది కూడా చ‌ద‌వండి: Beast: మ‌రోసారి కేంద్ర ప్ర‌భుత్వంపై విజ‌య్ సెటైర్లుVijay Fans Set Screens on Fire:

ట్రెండింగ్ వార్తలు