Maharaja Ott Release: నెట్‌ఫ్లిక్స్‌లోకి విజ‌య్ సేతుప‌తి `మ‌హారాజ‌`, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

July 8, 2024

Maharaja Ott Release: నెట్‌ఫ్లిక్స్‌లోకి విజ‌య్ సేతుప‌తి `మ‌హారాజ‌`, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Maharaja OTT Release Date: విజ‌య్ సేతుప‌తి ప్ర‌తిష్టాత్మ‌క 50వ చిత్రం ‘మహారాజా'(Maharaja) జూలై 12న ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్‌ 14న థియేటర్‌లలోకి వచ్చినప్పటికీ, థియేట్రికల్ రన్‌లో ఈ చిత్రం అపూర్వమైన విజ‌యాన్ని అందుకుంది. ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌(Maharaja on Netflix) లో తెలుగు, హింది, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల‌లో ఈ సినిమా అందుబాటులో ఉండ‌నుంది.

లక్ష్మి ఎవరు? అనే పాయంట్‌తో ఎమోషనల్ థ్రిల్లర్ గా తెర‌కెక్కిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి టైటిల్ రోల్‌ను పరిపూర్ణంగా పోషించాడు, అత‌నికి పోలీసు పాత్రలో నట్టి మంచి మద్దతుతో పాటు అనురాగ్ కశ్యప్, అభిరామి, భారతిరాజా, మునిష్కాంత్ మరియు మణికందన్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల‌లో న‌టించారు.

అజనీష్ లోక్‌నాథ్ సంగీతం ఈ సినిమాకు నెక్స్ట్ లెవ‌ల్‌కి తీసుకెళ్లింది అన‌డంతో అతిశ‌యోక్తి లేదు.. పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ మరియు ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ ద్వారా క్రియేట్ చేసిన సహజమైన అనుభూతి ఈ కథకు మరింత గాఢ‌త‌ను జోడించింది.

ఒక‌వైపు ‘కల్కి 2898 AD’ నుండి గట్టి పోటీ ఉన్నప్పటికీ, మొదటి 10 రోజుల్లో రూ. 80 కోట్లకు పైగా వసూలు చేసి, 2024లో ఉత్తమ తమిళ చిత్రంగా ‘మహారాజాస నిలిచింది. థియేటర్లలో మూడో వారం ముగిసే సమయానికి 100 కోట్ల మార్క్‌ను దాటేసింది.

‘మహారాజా’ ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా లాస్ ఏంజిల్స్‌లోని ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా విజయం సాధించింది, దానికి అక్కడ స్టాండింగ్ ఒవేషన్ కూడా ల‌భించ‌డం గ‌మ‌నార్హం. విజయ్ సేతుపతి మరియు దర్శకుడు నితిలన్ సామినాథన్‌తో పాటు, మమతా మోహన్‌దాస్ US లో జరిగిన ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో పాల్గొన్నారు.

ఇటీవ‌ల విజ‌య్ సేతుప‌తి ఈ విజ‌యం గురించి మాట్లాడుతూ “రాష్ట్రం వెలుపల మ‌హారాజ సినిమాకు వచ్చిన అద్భుతమైన స్పందనతో మేము చాలా సంతోషంగా ఉన్నాము.” “సినిమాకు పనిచేసిన ప్రతి నటుడిపైనా, టెక్నీషియన్‌పైనా జనం ప్రేమను కురిపిస్తున్నారు. ఏం చెప్పాలో తెలియడం లేదు!అని అన్నారు.

విజయ్ సేతుప‌తి ప్రస్తుతం వెట్రిమారన్ దర్శకత్వంలో ‘పెద్ది’ మరియు ‘విడుతలై పార్ట్ 2′ వంటి ప్ర‌స్టీజియ‌స్‌ ప్రాజెక్ట్‌లలో బిజీగా ఉన్నారు. విడుతలై పార్ట్ 2’ సినిమా 2024 దీపావళికి గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది.

Related News

ట్రెండింగ్ వార్తలు