ఆమెతో నటించడం నావల్ల కాదు.. నటుడు విజయ్ కామెంట్స్ వైరల్!

June 6, 2024

ఆమెతో నటించడం నావల్ల కాదు.. నటుడు విజయ్ కామెంట్స్ వైరల్!

కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు విజయ్ సేతుపతి ఒకరు. ఈయన హీరోగా మాత్రమే కాకుండా ఎన్నో సినిమాలలో విలన్ పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక తెలుగులో ఈయన మాస్టర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అనంతరం ఉప్పెన సినిమా ద్వారా హీరోయిన్ తండ్రి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ప్రస్తుతం విజయ్ సేతుపతి కేవలం కోలీవుడ్ సినిమాలు మాత్రమే కాకుండా తెలుగు బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే ఈయన నటించిన మహారాజ సినిమా జూన్‌ 14న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈయనకు మరోసారి నటి కృతి శెట్టి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే ఆ హీరోయిన్ తో నటించడం నావల్ల కాదు అంటూ ఈయన కామెంట్లు చేశారు. నేను నటించిన డీఎస్పీ సినిమాలో కృతి శెట్టిని హీరోయిన్‌గా తీసుకుంటే.. చేయలేనని దర్శక నిర్మాతలకు చెప్పా. ఉప్పెన సినిమాలో తనకు తండ్రి పాత్రలో నటించాను ఆమెను నేను కూతురుగానే ఊహించుకొని ఆ పాత్రలో నటించానని తెలిపారు..

ఇక ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల చిత్రీకరణలో ఆమె చాలా భయపడింది. ఆ సమయంలో నాకు నీ వయసెంత కొడుకు ఉన్నారు. నన్ను కూడా నీ తండ్రిగా భావించి నటించని తనకు ధైర్యం చెప్పాను. అలా కూతురుగా భావించిన అమ్మాయితో రొమాన్స్ చేయడం అంటే నా వల్ల కాదు అంటూ ఈ సందర్భంగా విజయ్ సేతుపతి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Read More: బుచ్చిబాబు సినిమా కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్న చరణ్.. పెరుగుతున్న అంచనాలు?

Related News

ట్రెండింగ్ వార్తలు