May 14, 2024
వెంకటేష్ ప్రభు దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ది గోట్. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అనే ఉప శీర్షికతో వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ షురూ అయిందని మేకర్స్ వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏ జి ఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు.
కాగా విజయ్ సరసన మీనాక్షి చౌదరి ఫిమేల్ లీడ్ రోల్ లో నటిస్తుంది.ఇంకా ఈ సినిమాలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్,అజ్మల్ అమీర్,మైక్ మోహన్, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్ మరియు అరవింద్ ఆకాష్ కీలకపాత్రలలో కనిపించబోతున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ ఐదున థియేటర్లలో విడుదల కాబోతుందని మేకర్స్ ప్రకటించారు.
యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. విజయ్, యువన్ శంకర్ రాజా కాంబినేషన్లో 20 సంవత్సరాల తర్వాత వస్తున్న సినిమా ఇది. దీంతో ఈ సినిమా మీద మరిన్ని అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం నుంచి విజిల్ పోడు అనే మొదటి సింగిల్ ట్రాక్ ని మేకర్స్ ఆవిష్కరించారు. విజయ్ స్వయంగా ఈ ట్రాక్ పాడటం, ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయిన విషయం అందరికీ తెలిసిందే.
అయితే విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ జానర్ లో రాబోతుంది . ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా సిద్ధార్థ రవి సినిమాటోగ్రాఫర్ గా వెంకట్ రాజు ఎడిటింగ్ బాధ్యతలు చేపడుతున్నారు. ఒక్క తమిళంలోనే కాకుండా ఈ సినిమా తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని జూన్ లో రిలీజ్ చేయబోతున్నట్లు సినీ వర్గాల సమాచారం.
Read More: వివాహ బంధానికి వీడ్కోలు పలికిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. అర్థం చేసుకోవాలంటూ విన్నపం!