వార‌సుడుగా ద‌ళ‌ప‌తి విజ‌య్..ఆ సినిమాకు రీమేకా?

June 23, 2022

వార‌సుడుగా ద‌ళ‌ప‌తి విజ‌య్..ఆ సినిమాకు రీమేకా?

దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి వార‌సుడు(Varasudu) అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్లో విజ‌య్‌ స్టయిలీష్ గా కనిపిస్తూనే సీరియస్ లుక్ లో క‌నిపించారు. మ‌హ‌ర్షి త‌ర్వాత వంశీ పైడిపల్లి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న చిత్ర‌మిది. తమిళంలో ‘వారిసు‘ టైటిల్ ని ఖరారు చేశారు.

రష్మిక మందన్న హీరోయిన్‌. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలో సినిమా కోర్ టీమ్ పై కీలకమైన భారీ షెడ్యూల్‌ షూటింగ్ జరుగుతుంది. ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

అయితే ఈ సినిమా పోస్ట‌ర్లు అచ్చంగా గ‌తంలో వ‌చ్చిన సినిమా పోస్ట‌ర్ల‌లాగే ఉండ‌డంతో వార‌సుడు సినిమా ఆ సినిమాల‌కు రీమేక్ అంటూ ప్ర‌చారం చేస్తున్నారు నెటిజన్లు.

Vijay Varasudu Varasudu Vijay Varasudu Read More: జూన్ 30న పృథ్వీరాజ్, వివేక్ ఓబెరాయ్, సంయుక్త మీన‌న్‌ క‌డువా

ట్రెండింగ్ వార్తలు