February 22, 2022
బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ నటించిన సీత సినిమా డిజాస్టర్ కావడంతో సినిమాలకు కొంత విరామం తీసుకున్నారు దర్శకుడు తేజ. ఈ రోజు తేజ పుట్టినరోజు ఈ సందర్భంగా అభిరామ్ దగ్గుబాటిని హీరోగా పరిచయం చేస్తున్న అహింస మూవీ ప్రీ లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. టైటిల్‌కి లుక్‌కి సంబంధం లేకపోవడంతో మిశ్రమ స్పందన లభించింది. అలాగే కాసేపటి క్రితం మరో సినిమా అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో నటీనటులను ఎంపిక చేయలేదు కాని ఈ రోజు షూటింగ్ ప్రారంభం అని ఇచ్చారు. అలాగే ఈ సినిమాకి రాధేశ్యామ్‌లో ప్రభాస్ పేరు విక్రమాదిత్య..అని పెట్టారు. దాంతో ఈ టైటిల్‌ను కూడా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్…పుట్టిన రోజు నాడు కూడా తేజ కంబ్యాక్ అనేలాంటి ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేకపోవడం బాధాకరం.
READ MORE: Radheshyam: ప్రభాస్ సినిమాకి అమితాబ్ వాయిస్ ఓవర్