హృతిక్‌ రోషన్‌ కన్నా..విజయ్‌సేతుపతియే బెటర్‌..నెటిజన్లు రివ్యూ

August 24, 2022

హృతిక్‌ రోషన్‌ కన్నా..విజయ్‌సేతుపతియే బెటర్‌..నెటిజన్లు రివ్యూ

మాధవన్, విజయ్‌ సేతుపతి ప్రధానపాత్రల్లో నటించిన తమిళ హిట్‌ ఫిల్మ్‌ ‘విక్రమ్‌ వేదా’. పుష్కర్‌ గాయత్రీ ద్వయం తెరకెక్కించిన ఈ సినిమా 2017లో విడుదలై అద్భుత విజయం సాధించింది. ఇన్‌స్పెక్టర్‌ విక్రమ్‌గా మాధవన్, గ్యాంగ్‌స్టర్‌ వేదాగా విజయ్‌సేతుపతి నటించారు. అయితే ‘విక్రమ్‌వేదా’ సినిమా హిందీలో రీమేక్‌ అయ్యింది. ఇన్‌స్పెక్టర్‌ పాత్రలో సైఫ్‌ అలీఖాన్, వేద పాత్రలో హృతిక్‌రోషన్‌ నటించారు. మాతృకకు దర్శకత్వం వహించిన పుష్కర్‌ గాయత్రీ ద్వయమే హిందీ రీమేక్‌ విక్రమ్‌వేదాకూ దర్శకత్వం వహించారు.

విక్రమ్‌వేదా హిందీ టీజర్ ఈ రోజు (ఆగస్టు 24న) విడుదలైంది. అంతే..తమిళ విక్రమ్‌వేదాకు, హిందీ విక్రమ్‌వేదాకు పోలికలు పెట్టడం స్టార్ట్‌ చేశారు నెటిజన్లు. కొందరైతే హిందీ టీజర్‌ ఏ మాత్రం బాగోలేదని ట్వీట్స్‌ చేయగా, మరికొందరు మాత్రం హృతిక్‌రోషన్‌ కన్నా విజయ్‌సేతుపతియే వేదా పాత్రలో బాగా చేశాడన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. టీజర్‌కే నెటిజన్లు ఇంత రచ్చ చేస్తే హిందీ విక్రమ్‌వేదా చిత్రం సెప్టెంబరు 30న థియేటర్స్‌లోకి వస్తుంది అప్పుడు ఇంక ఎంత హంగామా చేస్తారో, ఎన్ని పోలికలు పెడతారో చూడాలి మరి.. మరోవైపు హిందీ లో విజయ్‌సేతుపతి కరీనాకపూర్‌తో కలిసి ‘మేరీ క్రిస్మస్‌’ అనే సినిమా చేశాడు. తమిళ హిట్‌ ‘మా నగరం’ హిందీ రీమేక్‌లోనూ నటించాడు. ఇక ఇటీవల విడుదలైన ‘లాల్‌సింగ్‌ చద్దా’ సినిమాలోని బాల క్యారెక్టర్‌ను తొలుత విజయ్‌సేతుపతియే చేయాల్సింది కానీ ఫైనల్‌గా నాగచైతన్య చేసిన విషయం తెలిసిందే.

Related News

ట్రెండింగ్ వార్తలు