కుప్పంలో చంద్రబాబుకు పోటీగా విశాల్‌….నిజం ఇదిగో..!

July 2, 2022

కుప్పంలో చంద్రబాబుకు పోటీగా విశాల్‌….నిజం ఇదిగో..!

తమిళ హీరో విశాల్‌ తెలుగు మూలాలు ఉన్న హీరో అని అందరికీ తెలిసిన విషయమే. అయితే సడన్‌గా ఏపీ పాలిటిక్స్‌లోకి విశాల్‌ పేరు తెరపైకి వచ్చింది. రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసి ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కుప్పం అన్న సంగతి తెలిసిందే. అయితే 2024లో జరిగబోయే ఎలక్షన్స్‌లో కుప్పంలో చంద్రబాబునాయుడికి పోటీగా విశాల్‌ ఎలక్షన్స్‌లో నిలబడనున్నారు అనే వార్త నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. పైగా విశాల్‌ ప్రస్తుత అధికార పార్టీ వైపీసీ తరఫున పోటీ చేస్తారనే టాక్‌ ఊపదుకుంది.

ఈ తరుణంలో విశాల్‌ సోషల్‌మీడియా వేదికగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌పాలిటిక్స్‌లోకి నన్ను లాగవద్దని, కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబునాయుడుగారికి పోటీగా ఎలక్షన్స్‌లో నిలబడే ఆలోచన తనకు ఏ మాత్రం లేదని విశాల్‌ ఓ భారీలేఖనే రాసుకొచ్చాడు. అదీ సంగతి మరి..ఇటు సినిమాల విషయానికి వస్తే..కెరీర్‌లో ఓ మాంచి హిట్‌ కోసం ఎదురుచూస్తున్న విశాల్‌ ప్రస్తుతం‘లాఠీ’ అనే ఓ పోలీస్‌ బ్యాక్‌డ్రాప్‌ ఫిల్మ్‌ చేస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 12న రిలీజ్‌ కానుంది. రిలీజ్‌లో మార్పులు ఉండే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు