ఫిబ్ర‌వ‌రి 4న విశాల్ సామాన్యుడు

January 29, 2022

ఫిబ్ర‌వ‌రి 4న విశాల్ సామాన్యుడు

Vishal Saamanyudu all set to hit the screens on Feb 4th: యాక్షన్ హీరో విశాల్ లేటెస్ట్ మూవీ ‘సామాన్యుడు’. ఈ సినిమాతో తు ప శరవణన్ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ యాక్షన్ డ్రామాకు నాట్ ఏ కామన్ మ్యాన్ అనేది ట్యాగ్‌లైన్‌. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ప‌తాకంపై విశాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్ప‌టికే విడుదల చేసిన టీజర్‌కు, ఇటీవ‌ల విడుద‌ల చేసిన ట్రైల‌ర్‌కు మంచి స్పందన రావ‌డంతో తెలుగు, తమిళ భాషల్లో సినిమా మీద అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్‌. విశాల్ సామాన్యుడు (Vishal Saamanyudu) చిత్రం ఫిబ్ర‌వ‌రి 4న థియేట‌ర్స్‌లో రిలీజ్‌కానుంది. ఈ మేర‌కు విడుద‌ల‌చేసిన పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటుంది.

యోగిబాబు, బాబురాజ్ జాకబ్, పా తులసి, రవీనా రవి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి కెవిన్ రాజ్ సినిమాటోగ్రఫీ, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

Read More: F3 Movie: ఒక్క పాట మిన‌హా షూటింగ్‌ పూర్తి  

ట్రెండింగ్ వార్తలు