బాలయ్య పై ట్రోల్స్ ఆపండి.. బాలయ్య అంజలి ఘటనపై విశ్వక్ కామెంట్స్!

May 30, 2024

బాలయ్య పై ట్రోల్స్ ఆపండి.. బాలయ్య అంజలి ఘటనపై విశ్వక్ కామెంట్స్!

నటుడు విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మే 31వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలను కూడా ఎంతో ఘనంగా జరుపుకున్నారు. అయితే ఈ వేడుకలలో బాలయ్య భారీ స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈయన వేదికపై అందరూ ఉండగా నటి అంజలిని తోయడంతో పెద్ద ఎత్తున వివాదంగా మారింది.

ఇలా బాలకృష్ణ అందరి ముందు హీరోయిన్ అంజలిని తోయడంతో ఆమె ఒక్కసారిగా భయపడ్డారు అయితే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో బాలకృష్ణ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. బాలయ్య ఆడవాళ్లకు గౌరవం ఇవ్వాలని తెలియదా అంటూ కొందరు కామెంట్లు చేయగా ఎప్పుడు మహిళలపై ఇలా అనుచిత ప్రవర్తన చేస్తూ ఉంటారంటూ ఈయన పట్ల విమర్శలు కురిపిస్తున్నారు.

ఇలా బాలయ్య గురించి ఈ విధమైనటువంటి విమర్శలు రావడమే కాకుండా పక్కన మందు సీసాలు కూడా ఉన్నాయి అంటూ వీడియోని వైరల్ చేస్తున్నారు అయితే ఈ విమర్శలపై నిర్మాత నాగ వంశీ అలాగే నటుడు విశ్వక్ స్పందించారు. ఈ ఘటనపై నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ బాలకృష్ణ సీటు పక్కన మందు బాటిళ్లు ఉన్నట్టు సోషల్ మీడియాలో చూపిస్తున్నారు అది అంతా అబద్ధమని తెలిపారు ఎందుకంటే ఈ ప్రోగ్రాం అంతా చేసింది నేనే కేవలం గ్రాఫిక్స్ తో మందు బాటిల్స్ క్రియేట్ చేశారని ఈయన తెలిపారు.

ఇక ఈ విమర్శలపై విశ్వక్ స్పందిస్తూ బాలయ్య పై చేస్తున్నటువంటి ట్రోల్స్ ఇకపై ఆపండి అంటూ ఆయన తెలిపారు.ఈవెంట్ లో జరిగింది వేరు సోషల్ మీడియాలో చూపించేది వేరు…దానిని ముందు వెనుక కట్ చేసి వైరల్ చేస్తున్నారు.బాలయ్య ఎప్పుడు అందరితో సరదాగా వుంటారు. ఇకనైనా ఆయన గురించి విమర్శలు చేయడం ఆపండి అంటూ విశ్వక్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Read More: Ramcharan: బుచ్చిబాబు సినిమాకు భారీగా రెమ్యూనరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఎన్ని కోట్లు తెలుసా?

Related News

ట్రెండింగ్ వార్తలు