Gangs Of Godavari Twitter Review: విశ్వ‌క్ సేన్ న‌టించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ఎలా ఉందంటే?

May 31, 2024

Gangs Of Godavari Twitter Review: విశ్వ‌క్ సేన్ న‌టించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ఎలా ఉందంటే?

యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ మంచి న‌టుడే.. కానీ త‌న నోటి దురుసు ప్ర‌వ‌ర్త‌న‌తో అప్పుడ‌ప్పుడు కొన్ని స‌మ‌స్య‌లు కొని తెచ్చుకుంటుంటాడు..ప్ర‌స్తుతం ఆయ‌న హీరోగా న‌టించిన `గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి` ఈ రోజు విడుద‌లైంది. కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో `డీజే టిల్లు` ఫేమ్ నేహా శెట్టి, అంజ‌లి హీరోయిన్స్‌గా న‌టించారు. నాగ‌వంశీ నిర్మాత‌. ట్రైల‌ర్‌లోనే బూతు డైలాగ్స్‌తో హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నంద‌మూరి బాల‌కృష్ణ ముఖ్య అతిథిగా రావ‌డంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన `గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి` ట్విట్ట‌ర్ రివ్యూ ఇప్పుడు చూద్దాం..

గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాకు మంచి హైప్ వ‌చ్చింది. అయితే బీజీఎం అంత గొప్పగా లేదు. విశ్వక్ సేన్ మాస్ అవతారంలో ఇరుగదీశాడు. నిర్మాత నాగవంశీ చెప్పినట్టు గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి సినిమాలో విశ్వక్ సేన్ నట విశ్వరూపం చూపించాడు. సినిమా అదిరిపోయింది అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

Hyped for the #GangsofGodavari movie, especially the BGM in ‘Bad’ song🔥🔥🔥🔥🔥🔥. @VishwakSenActor looks stunning in mass avatar. Expecting nothing less than ‘Nata Viswaroopam’ as @vamsi84 promised! 🔥#vishwaksen— Shaik Mohammad Khasim (@khasimtweets) May 30, 2024

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో విశ్వక్ సేన్, నిర్మాత నాగవంశీకి శుభాకాంక్షలు. నందమూరి బాలకృష్ణ అభిమానుల తరఫున ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకొంటున్నాం. చిత్ర యూనిట్‌కు అభినందనలు అని బాలయ్య ఫ్యాన్స్ విషెస్ అందజేశారు.

Wishing heartful wishes to @VishwakSenActor anna and @vamsi84 and entire team of #GangsofGodavari releasing tomorrow and hope blockbuster success behalf of #NandamuriBalakrishna garu fans ..

.@iamnehashetty @yoursanjali pic.twitter.com/X4e3S5DwZX

— భం అఖండ (భగవంత్ కేసరి) 💥💥 (@legendSashidhar) May 30, 2024

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ట్రైలర్ టెర్పిఫిక్‌గా ఉంది. నటీనటుల యాక్టింగ్ ఎక్సలెంట్. విజువల్స్ బాగున్నాయి. ట్రైలర్‌ను బట్టి సినిమా మంచి కంటెంట్‌తో ఉంది. కాబట్టి తప్పకుండా బ్లాక్ బస్టర్ సినిమానే అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

#GangsofGodavari Trailer looks terrific. Excellent performances, Rocking Background score and good visuals. Looks a sure shot blockbuster!!#ViswakSen #NehaShetty#KalyanKrishna pic.twitter.com/qJebhQmmDd— Movie Maniac (@iamcvr) May 30, 2024

Read More: ఆ ఒక్క కారణంతోనే కల్కి బడ్జెట్ ఎక్కువైంది.. ప్రభాస్ కామెంట్స్ వైరల్!

ట్రెండింగ్ వార్తలు