December 14, 2021
రానా దగ్గుబాటి సాయి పల్లవి కలిసి నటిస్తోన్న చిత్రం విరాట పర్వం. ఈ సినిమాలో రానా కామ్రేడ్ రవన్న అనే నక్సలైట్‌గా కనిపించనున్నారు. అతన్ని ప్రేమించే అమ్మాయి వెన్నెల పాత్రలో సాయి పల్లవి కనిపించబోతుంది. నాలుగైదు రోజులు మినహా షూటింగ్ పూర్తయ్యింది. దాంతో దాదాపు రెండేళ్లుగా ఈ సినిమా ఆలస్యమవుతూ వస్తుంది.
1990నాటి ప్రాంతంలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా యుద్ద నేపథ్యంలో అందమైన ప్రేమ కథగా విరాట పర్వం ఉండబోతుందని చిత్ర యూనిట్ తెలుపుతూ వస్తుంది. అయితే ఈ రోజ రానా బర్త్ డే సందర్బంగా వాయిస్ ఆఫ్ రవన్న అంటూ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఇక ఇందులో రవన్న ఇచ్చిన ప్రసంగం అందరినీ ఉత్తేజ పరిచేలా ఉంది.
‘మారదులే.. ఈ దోపిడి దొంగల రాజ్యం మారదులే.. రౌద్రపు శత్రువు దాడిని ఎదురించే పోరాటం మనది. చలో చలో చలో పరిగెత్తు.. అడుగే పిడుగై రాలేలా గుండెల దమ్ముని చూపించు.. చలో చలో పరిగెత్తు.. చీకటి మింగిన సూర్యుని తెచ్చి తూర్పు కొండని వెలిగిద్దాం.. పొంగిన వీపుల బరువులు దించి విప్లవ గీతం వినిపిద్దాం. చలో చలో పరిగెత్తు.. చలో చలో పరిగెత్తు. దొరొల్ల తలుపుల తాళంలా.. గఢీల ముంగట కుక్కల్లా.. ఎన్నాళ్లు ఇంకెన్నాళ్లు.. చలో పరిగెత్తు.. చలో పరిగెత్తు’ అంటూ రవన్న పాత్రలో రానా చెప్పిన డైలాగ్స్ హైలెట్ అవుతున్నాయి.
సంక్రాంతికి ట్రైలర్ రాబోతోన్నట్టు ఈ వీడియో ద్వారా ప్రకటించారు. ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, జరీనా వాహబ్, ఈశ్వరీ రావ్, సాయి చంద్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
https://youtu.be/Kuw9mLEQqrQ