August 5, 2024
Magadheera Collections: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. ఈయన దర్శకత్వంలో సినిమా వచ్చింది అంటే ఆ సినిమా అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాయడం పక్క అనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వంలో 2009వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మగధీర. ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. అల్లు అరవింద్ నిర్మాణంలో రామ్ చరణ్ కాజల్ అగర్వాల్ నటించిన ఈ సినిమా సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ అందుకుంది.
ఈ సినిమా ద్వారా అప్పటివరకు ఉన్న సినిమా రికార్డులు మొత్తం చెరిగిపోయాయి. అయితే అప్పట్లో సినిమా సక్సెస్ అయ్యింది అంటే ఫలానా సినిమా ఇన్ని థియేటర్లలో ఎన్ని రోజులు ఆడింది అంటేనే గొప్ప. సినిమా కలెక్షన్లను పట్టించుకునేవారు కాదు. ఇలా హీరోల మధ్య కూడా ఇలాంటి పోటీనే ఉండేది కానీ రాజమౌళి మాత్రం ఈ సినిమా నుంచి ఆ ట్రెండ్ మార్చాలని అల్లు అరవింద్ తో మాట్లాడారట. మనం మగధీర సినిమా విషయంలో ఇన్ని డేస్ ఆడింది అని పోస్టర్లు వేయకూడదు ఇదొక బ్యాడ్ ట్రెండ్ ఈ ట్రెండ్ ని నిలిపివేయాలి అని చర్చించుకున్నారట అందుకు అల్లు అరవింద్ కూడా ఓకే అని చెప్పారు.
ఇక ఈ సినిమా విడుదల అయ్యి ఎంతో మంచి సక్సెస్ అయ్యింది అందరూ కూడా సినిమా సెలబ్రేషన్స్ లో ఉన్నారు కానీ అల్లు అరవింద్ మాత్రం ఈ సినిమా ఫలానా థియేటర్లో ఎన్ని రోజులు ఆడింది అంటూ పోస్టర్లు వేశారట. ఇలా పోస్టర్లు వేయడంతో రాజమౌళి కోపం వచ్చి అదేంటండీ మనం ముందుగానే అనుకున్నాం కదా మరి డేస్ పోస్టర్లు వేశారు ఏంటి అని అడిగారట. నాకు కూడా ఇష్టం లేదు రాజమౌళి కానీ అభిమానుల నుంచి ఎక్కువ ఒత్తిడి రావడంతోనే ఇలా చేశాను అంటూ అల్లు అరవింద్ చెప్పడంతో ఆ విషయంలో నాకు కోపం వచ్చిందని రాజమౌళి ఈ సినిమా విషయాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది