ప్రియమణి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత.. ఆ డబ్బు ఏం చేసిందో తెలుసా?

April 13, 2024

ప్రియమణి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత.. ఆ డబ్బు ఏం చేసిందో తెలుసా?

ఒకప్పుడు తెలుగు తమిళ సూపర్ హిట్ సినిమాలలో నటించి హీరోయిన్గా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగినటువంటి వారిలో సీనియర్ నటి ప్రియమణి ఒకరు. ఈమె తెలుగు తమిళ భాష చిత్రాలలో స్టార్ హీరోలు అందరి సరసన నటించే అవకాశాలను అందుకుంటు కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీ అయ్యారు. అయితే 2017 వ సంవత్సరంలో ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని ఈమె వివాహం చేసుకున్నారు..

ఇలా వీరి వివాహం తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు దూరమైనటువంటి ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రారంభించారు. ఇలా బుల్లి తెరపై వరుస కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తున్నటువంటి ఈమెకు అనంతరం సినిమా అవకాశాలు వచ్చాయి. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అవుతున్నటువంటి ఈమె ఇటీవల కాలంలో ఏకంగా బాలీవుడ్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా నటించే అవకాశాలను సొంతం చేసుకున్నారు.

ఇకపోతే ఇటీవల మైదాన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రియమణి వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ తనకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రియమణి ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన ఫస్ట్ రెమ్యూనరేషన్ గురించి పలు విషయాలను వెల్లడించారు.

హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి వచ్చిన మొదట్లో తాను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాను అని తెలిపారు. ఇక ఇప్పుడు కోట్లల్లో రెమ్యూనరేషన్ అందుకుంటున్నటువంటి ఈమె కెరియర్ మొదట్లో కేవలం తన మొదటి సంపాదనగా 500 రూపాయలు అందుకున్నారని తెలుస్తుంది అయితే తన తొలి సంపాదన అయినటువంటి ఈ 500 రూపాయలను ఇప్పటికి తన వద్ద చాలా భద్రంగా దాచుకున్నాను అంటూ ప్రియమణి కామెంట్లు చేశారు.

ఇక ప్రస్తుతం ఈమె సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లకు కూడా కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు. సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను మాత్రం అనుకున్న స్థాయిలో చేరుకోలేక పోయిందని చెప్పాలి.

https://telugu.chitraseema.org/%e0%b0%b8%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%ab%e0%b1%80-%e0%b0%85%e0%b0%82%e0%b0%9f%e0%b1%82-%e0%b0%8e%e0%b0%97%e0%b0%ac%e0%b0%a1%e0%b0%bfbalakrishna-slaps-his-fan-again-for-wanting-a-selfie%e0%b0%a8/

ట్రెండింగ్ వార్తలు