May 15, 2024
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి నటుడు ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా మారిపోయారు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ త్వరలోనే కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు ఈయన స్పిరిట్, సలార్ 2, రాజా సాబ్, వంటి సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలతో పాటు ఈయన మరో పాన్ ఇండియా సినిమాలో చిన్న పాత్రలో నటించబోతున్నారు.
సినీ ఇండస్ట్రీలో ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీలలో మంచు ఫ్యామిలీ కూడా ఒకటి. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి కన్నప్ప సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్లో భాగంగా ఇటీవల ప్రభాస్ లొకేషన్ లోకి అడుగుపెట్టినట్లు మంచు విష్ణు అధికారికంగా వెల్లడించారు. ఇందులో ప్రభాస్ శివుడి పాత్రలో నటించబోతున్న సంగతి తెలిసిందే.
ఇలా కన్నప్ప సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రలో నటించబోతున్నారనే విషయం తెలియడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి అయితే ఈ సినిమాలో ప్రభాస్ నటించినందుకు ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించబోతున్నారని తెలుస్తోంది. ఇలా రెమ్యూనరేషన్ లేకుండా ప్రభాస్ ఒక పాన్ ఇండియా సినిమాలో నటించడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.
ప్రస్తుతం ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. అలాంటి ఒక స్టార్ హీరో రెమ్యూనరేషన్ లేకుండా మరొక పాన్ ఇండియా సినిమాలో నటించడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. ఇక కన్నప్ప సినిమాలో కన్నడ నటుడు శివకుమార్ మలయాళ నటుడు మోహన్ లాల్, మంచు మోహన్ బాబు వంటి తదితరులు అందరు కూడా కీలక పాత్రలలో నటించబోతున్నారని తెలుస్తుంది.