Venu Swamy: కల్కిలో హీరో ఎవరు..మరోసారి ప్రభాస్ ని గెలికిన వేణుస్వామి?

July 11, 2024

Venu Swamy: కల్కిలో హీరో ఎవరు..మరోసారి ప్రభాస్ ని గెలికిన వేణుస్వామి?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కి(Kalki 2898AD Movie) సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇప్ప‌టికే ఈ సినిమా ప‌లు రికార్డుల్ని తిర‌గ‌రాసింది. అయితే ప్రభాస్ సినిమాల గురించి గతంలో వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా మరోసారి కల్కి సినిమా గురించి ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

బాహుబలి 2 తర్వాత ప్రభాస్ సినిమాలు ఏవీ సక్సెస్ కావు అని వేణు స్వామి జాతకం చెప్పారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామికి ఇదే ప్రశ్న ఎదురైంది. బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ ఫ్లాప్ అని చెప్పారు. ఇప్పుడు కల్కి హిట్ అయింది కదా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు వేణు స్వామి సమాధానం చెబుతూ చాలా మంచి ప్రశ్న వేశారు బాహుబలి 2 తర్వాత ప్రభాస్ సినిమాలు హిట్ కావని చెప్పాను. ఈ సినిమా తర్వాత వచ్చిన రాధేశ్యామ్, సాహో, ఆది పురుష్, సలార్ వంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అప్పుడు వచ్చి నాకు ఎవరు మెడలో దండు వేసి నువ్వు చెప్పింది నిజమైందని చెప్పలేదే అంటూ ఎదురు ప్రశ్నివేశారు.

సలార్ సినిమా హిట్ అని అభిమానులు సంబరపడ్డారు కానీ ఆ సినిమాకు 135 కోట్ల వరకు నష్టాలు వచ్చాయని వేణు స్వామి తెలిపారు. ఇక కల్కి విషయానికి వస్తే అసలు కల్కి సినిమాలో హీరో ఎవరు? ప్రభాస్ స్క్రీన్ పై ఎంతసేపు ఉన్నార? కల్కి నిర్మాతలకు ఎన్ని లాభాలు వచ్చాయి? త్వరలోనే తెలుస్తుందని తెలిపారు. ఇలా కల్కి సినిమా గురించి మరోసారి ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఇక ప్రభాస్ నాకు వ్యక్తిగతంగా శత్రువు కాదు.. మేమిద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉంటాము ఇప్పటికీ మా తోటలో పండిన పండ్లను ప్రభాస్ కి పంపిస్తూ ఉంటాము. అలాగే నేను పెట్టుకున్న కళ్ళజోడు బాగున్నాయని ప్రభాస్ మేనేజర్ నాకు ఫోన్ చేసి మరి ఆ విషయాలు కనుక్కున్నారని తెలిపారు. ఇక ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నన్ను చాలామంది ట్రోల్ చేశారు. కానీ ప్రభాస్ మాత్రం నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చారు అంటూ చెప్పుకొచ్చారు.

ట్రెండింగ్ వార్తలు