మెగా సంబరాలలో కనిపించని అల్లు ఫ్యామిలీ… ఆ మనస్పర్ధలే కారణమా?

June 7, 2024

మెగా సంబరాలలో కనిపించని అల్లు ఫ్యామిలీ… ఆ మనస్పర్ధలే కారణమా?

పవన్ కళ్యాణ్ గెలుపుని మెగా కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత మొదటిసారి హైదరాబాద్ కి వెళ్లారు. ఇలా హైదరాబాద్ లోని చిరంజీవి నివాసానికి పవన్ కళ్యాణ్ వెళ్లడంతో అక్కడ పెద్ద ఎత్తున ఈయనకు ఘనస్వాగతం లభించింది. మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే చోట చేరి పవన్ కళ్యాణ్ కు ఘనంగా ఆహ్వానం పలికారు.

పవన్ కళ్యాణ్ సోదరులతో పాటు నాగబాబు కుటుంబ సభ్యులు అలాగే చిరంజీవి కూతుర్లు అల్లుళ్లు అందరూ కూడా అక్కడే ఉండి పవన్ కళ్యాణ్ గెలుపును సెలెబ్రేట్ చేసుకున్నారు. అయితే ఈ వేడుకలలో మెగా ఫ్యామిలీ అంతా ఉన్నప్పటికీ అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరు కూడా ఈ వేడుకలలో పాల్గొనలేదు.

ఇలా అల్లు కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇక్కడ లేకపోవడంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఈ విషయం గురించి చర్చలు జరుగుతున్నాయి. మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీని పూర్తిగా దూరం పెట్టినట్లేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎన్నికలలో భాగంగా మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతూ ప్రచారం చేశారు. కానీ అల్లు అర్జున్ మాత్రం సోషల్ మీడియా వేదికగా పవన్ కి మద్దతు తెలిపిన వైఎస్ఆర్సీపి పార్టీకి ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు.

ఇలా తన స్నేహితుడి కోసం మద్దతు తెలియజేస్తూ నంద్యాలకు వెళ్లారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున మెగా ఫాన్స్ అల్లు అర్జున్ పై ట్రోల్ చేశారు. అలాగే నాగబాబు సైతం మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మా వాడైనా పరాయి వాడే అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో మెగా వర్సెస్ అల్లు అనేలా సోషల్ మీడియాలో ట్రోల్స్ జరిగాయి. ఇక ఇప్పుడు పవన్ గెలుపును మెగా కుటుంబ సభ్యులు ఎంజాయ్ చేస్తున్నప్పటికీ అల్లు ఫ్యామిలీ దూరంగా ఉన్నారని ఈ మనస్పర్ధలే కారణమా అంటూ పెద్ద ఎత్తున అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

Read More: దేవుడా.. మహేష్ రాజమౌళి సినిమా వచ్చేది అప్పుడేనా.. షాక్ లో మహేష్ ఫ్యాన్స్?

ట్రెండింగ్ వార్తలు