అన్నింటిలో ఉన్నతంగా ఆలోచించే నమ్రతా ఆ విషయంలో ఎందుకు అలా చేస్తుంది?

May 30, 2024

అన్నింటిలో ఉన్నతంగా ఆలోచించే నమ్రతా ఆ విషయంలో ఎందుకు అలా చేస్తుంది?

సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ గా మంచి సక్సెస్ అయినటువంటి వారిలో నమ్రత మహేష్ బాబు జంట ఒకటి. నమ్రత బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగారు. అయితే ఈమె మహేష్ బాబుతో కలిసి వంశీ సినిమాలో నటించారు. ఈ సినిమా తర్వాత ప్రేమతో పడినటువంటి నమ్రత మహేష్ బాబుని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఈమె పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్నారు.

ఇక పెళ్లి తర్వాత నమ్రత కుటుంబ విషయాలను అలాగే పిల్లల బాధ్యతలను చూసుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక మహేష్ బాబు సినిమాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆమె బిజినెస్ వ్యవహారాలన్నింటిని కూడా చక్క పెడుతుంటారు. ఇక మహేష్ బాబు సినిమాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు అయినప్పటికీ కూడా నమ్రతనే చూసుకుంటారని తెలుస్తుంది. అందుకే నిర్మాతలు దర్శకులు మహేష్ బాబు దర్శనం కంటే నమ్రతను కలవడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు.

ఇలా మహేష్ బాబు సినిమాలకు సంబంధించి అన్ని విషయాలను కూడా ఆలోచించి అడుగులు వేసే నమ్రత కూతురి విషయంలో మాత్రం పూర్తి విభిన్నంగా ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. సితార ప్రస్తుతం ఆరో తరగతి చదువుతుంది. పట్టుమని 15 సంవత్సరాలు కూడా లేనటువంటి ఈ అమ్మాయిని ఒక మనీ మిషన్ గా వాడేస్తున్నారనే విమర్శలను ఎదురుకుంటున్నారు.

నిజానికి ఎవరికైనా సినిమా ఇండస్ట్రీలో ఉండే వారి పిల్లలకు వారి తల్లిదండ్రుల గ్లామర్ ఫీల్డ్ లో చూసిన తర్వాత వారికి కూడా ఈ ఇండస్ట్రీకి రావాలనే ఉంటుంది. సితార కూడా త్వరలోనే హీరోయిన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తోంది. కానీ ఇంత చిన్న వయసులోనే సితార పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది.

డిజిటల్ సెలబ్స్ అందరితో కూర్చోబెట్టి ఆమె ముందు ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక్కోసారి ఆమె ఎలాంటి సమాధానం చెప్పలేక కంగారుపడుతూ ఉంది. ఇంత చిన్న పిల్లలను పబ్లిక్ లోకి తీసుకువచ్చి ఇలాంటి ప్రశ్నలు వేస్తూ వారిని ఇబ్బందులకు గురిచేస్తుండడంతో సితార విషయంలో నమ్రత ఉన్నతంగా ఆలోచించలేకపోతున్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Read More: ఇంగ్లీష్ లో మాట్లాడి అగౌరవ పరచలేను..అందుకే మాట్లాడను: రష్మిక మందన్నా

ట్రెండింగ్ వార్తలు