అశోక్ గల్లా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్.. జోడి బాగుందటున్న నెటిజన్స్!

April 6, 2024

అశోక్ గల్లా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్.. జోడి బాగుందటున్న నెటిజన్స్!

మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా దేవకీ నందన వాసుదేవ సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి హనుమాన్ సినిమా క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథని అందించగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. లలితాంబికా ప్రొడక్షన్లో ప్రొడక్షన్ నెంబర్ వన్ గా సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నల్లపనేని యామిని ఈ సినిమాని సమర్పిస్తున్నారు. గతంలోనే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదల అయ్యి కథానాయకుడు పాత్రని పరిచయం చేసింది. ఇప్పుడు హీరో అశోక్ గల్లా పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ సినిమాకి బీమ్స్ సిసిరోలియో ఆకట్టుకునే బీట్లతో పాటలని స్వరపరచినట్లుగా ఈ ప్రోమో చూస్తే తెలుస్తుంది.

ఏమయిందే గుండెకు, ఆగదు నా అడుగు.. దేవకీ నందన వాసుదేవా నుంచి మెలోడియస్ ఫస్ట్ సింగిల్ ప్రోమో ఇదిగో.. హ్యాపీ బర్త్డే అశోక్ గల్లా అంటూ పోస్ట్ చేశారు. సురేష్ గంగుల అందించిన లిరిక్స్ కి తన గాత్రంతో ప్రాణం పోశారు ఈశ్వర్ దత్తు.హీరోయిన్ పై ఉన్న రహస్య ప్రేమను హీరో సాంగ్ రూపంలో వర్ణిస్తుండగా ఈ విజువల్స్ చాలా న్యాచురల్ గా కనిపిస్తున్నాయి. ఇద్దరి ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయని, జోడి బాగా కుదిరిందని కితాబునిస్తున్నారు నెటిజెన్స్.

ఇక చాలా రోజుల క్రితమే మూవీకి సంబంధించిన ఫస్ట్ యాక్షన్ వీడియోలో బురదలో జరిగే ఫైట్స్ తో కట్ చేసిన ఫస్ట్ యాక్షన్ సీక్వెన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ టీజర్ లో అశోక్ గల్లా మాస్ అవతారంలో కనిపించడం విశేషం. ఈ సినిమాలో వారణాసి మానస అశోక్ కి జంటగా నటిస్తుంది త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తాం అని మేకర్స్ చెప్తున్నారు.

Read More: భారీ బడ్జెట్ తో తేజ సజ్జ నెక్స్ట్ మూవీ.. హీరోయిన్ గా కన్ఫర్మ్ అయిన రితిక నాయక్

Related News

ట్రెండింగ్ వార్తలు