NTR Favourite Singers: ఎన్టీఆర్ కి ఆ ఇద్దరు సింగర్స్ అంటే అంత ఇష్టమా..

July 2, 2024

NTR Favourite Singers: ఎన్టీఆర్ కి ఆ ఇద్దరు సింగర్స్ అంటే అంత ఇష్టమా..

Jr Ntr Favourite Singer టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరో అనే ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నారు. ఈయన నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమవుతున్నాయి. ఎన్టీఆర్ నటించిన RRR సినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన తన సినిమాలన్నింటినీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడమే కాకుండా బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే మొదటి భాగం ఏప్రిల్ ఐదవ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ అక్టోబర్ 10వ తేదీ విడుదలకు సిద్ధమైంది.

ఇకపోతే ఈ సినిమా అనుకున్న సమయానికంటే ముందుగానే షూటింగ్ పూర్తి కావడంతో అక్టోబర్ 10వ తేదీ కాకుండా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇలా ఈ సినిమా పట్ల అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ చిత్రం వార్ 2 లో కూడా ఎన్టీఆర్ నటిస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక చిన్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఎన్టీఆర్ తనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇష్టమైన సింగర్స్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇద్దరు లేడీ సింగర్ అంటే తనకు చాలా ఇష్టమని వారి వాయిస్ ఎంతో అద్భుతంగా ఉంటుందంటూ ఈయన వెల్లడించారు.

ముఖ్యంగా అరవింద సమేత చిత్రంలో ఊరికి ఉత్తరాన అనే సాంగ్ పాడిన సింగర్ మోహన భోగరాజు వాయిస్ చాలా హైలెట్ గా నిలిచిందని ఆ సినిమాలో ఆ పాట చాలా ఎమోషనల్ గా అందరిని ఆకట్టుకుందని తెలిపారు. ఆమె వాయిస్ చాలా బాగుంటుందని తారక్ వెల్లడించారు. ఆమెతోపాటు సింగర్ గీత మాధురి వాయిస్ కూడా చాలా బాగుంటుంది అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి

ట్రెండింగ్ వార్తలు