మోక్షజ్ఞ కంటే ముందుగానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్న నందమూరి వారసుడు?

June 10, 2024

మోక్షజ్ఞ కంటే ముందుగానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్న నందమూరి వారసుడు?

సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. సినీ నటుడుగా నందమూరి తారక రామారావు ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ వారసులుగా ఇండస్ట్రీలోకి ఎంతోమంది వచ్చినప్పటికీ బాలకృష్ణ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మాత్రమే ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు.

ఇక బాలకృష్ణ తర్వాత తన వారసుడు మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి వస్తారని ఆయన రాక కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటివరకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి వార్తలు వచ్చిన క్లారిటీ మాత్రం రావడం లేదు. అయితే మోక్షజ్ఞ కంటే కూడా మరో తరం వారసుడు ముందుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తుంది.

నందమూరి తారక రామారావు మనవళ్ళుగా ఇప్పటికే కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో తమ హవా కొనసాగిస్తున్నారు. కానీ ఎన్టీ రామారావు ముని మనవడు నందమూరి తారక రామారావు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారని సమాచారం. ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ గురించి మనకు తెలిసిందే. ఈయన పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అయితే ఈయనకు ఇద్దరు కుమారులు కాగా తన పెద్ద కుమారుడికి తన తాతయ్య నందమూరి తారక రామారావు పేరు పెట్టుకున్నారు.

ఈ క్రమంలోనే వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో నందమూరి తారక రామారావు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని ఈయన ఇటీవల వెల్లడించారు. అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అన్ని విషయాలు ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఇలా ఎన్టీఆర్ ముని మనవడు ఇండస్ట్రీలోకి రాబోతున్నారనే వార్త తెలియడంతో ఆయన ఎలా ఉంటారు ఏంటి అనే విషయాలు గురించి అభిమానులు ఆత్రుత కనబరుస్తున్నారు.

ఇక తారక రామారావు ఇండస్ట్రీలోకి హీరోగా రాబోతున్నారనే విషయం తెలియడంతో కొంతమేర బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా బాలకృష్ణ తన కుమారుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు కానీ తనకు మనవడి వరస అయినటువంటి తారక రామారావు కూడా ఇండస్ట్రీలోకి వచ్చేస్తున్నారు అంటూ ఈ విషయంపై నిరాశ చెందుతున్నారు.

Read More: కిరాక్ షో ద్వారా బుల్లితెర పైకి రీ ఎంట్రీ ఇవ్వనున్న అనసూయ.. సినిమా చాన్సులు తగ్గాయా?

ట్రెండింగ్ వార్తలు