చరణ్ కి దొరికిన రెండో హీరోయిన్ …ఛాన్స్ కొట్టేసిన డ్యాన్సింగ్ డాల్!

April 12, 2024

చరణ్ కి దొరికిన రెండో హీరోయిన్ …ఛాన్స్ కొట్టేసిన డ్యాన్సింగ్ డాల్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వరకు సినిమాలలో నటిస్తే కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఇకపోతే రామ్ చరణ్ ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సాన దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపిక అయ్యారు. ఈ సినిమాలో ఈమె మొదటి హీరోయిన్గా నటించగా ఈ సినిమాలో మరొక హీరోయిన్ కూడా నటించబోతున్నారని వార్తలు వచ్చాయి అయితే ఆమె ఎవరు అంటూ ఇన్ని రోజులు ఎంతో ఆత్రుత నెలకొంది.

ఇకపోతే రామ్ చరణ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా డాన్సింగ్ డాల్ శ్రీ లీల ఛాన్స్ కొట్టేసారని తెలుస్తుంది. ప్రస్తుతం శ్రీ లీల పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా మినహా ఈమె చేతులలో ఎలాంటి సినిమా అవకాశాలు లేవు. ఈ క్రమంలోనే రాంచరణ్ సినిమాలో సెకండ్ హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసారని తెలుస్తుంది.

ముందుగా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటి కృతి శెట్టిని ఎంపిక చేయాలని భావించారు. కాని ఈ క్యారెక్టర్ కు శ్రీలీల అయితే బాగుంటుందని తీసుకున్నాడట బుచ్చిబాబు.శ్రీలీల రామ్ చరణ్ కాంబోలో పాట కూడా సెట్ చేస్తున్నారట. శ్రీలీల డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చరణ్ తోకలిసి రచ్చ చేయడం ఖాయం అంటున్నారు సినీ జనాలు. మరి ఈ విషయం గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంత వరకు నిజము ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. https://telugu.chitraseema.org/hyper-aadi-assures-pawan-kalyan-will-win-with-one-lakh-majaority/

 

ట్రెండింగ్ వార్తలు