పవన్ కు లక్ష మెజారిటీ గ్యారెంటీ.. హైపర్ ఆది కామెంట్లు వైరల్!

April 12, 2024

పవన్ కు లక్ష మెజారిటీ గ్యారెంటీ.. హైపర్ ఆది కామెంట్లు వైరల్!

హైపర్ ఆది జనసేన ప్రచార కర్తగా ప్రస్తుతం పెద్ద ఎత్తున పార్టీ ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈ పార్టీ ప్రచార కార్యక్రమాలలో భాగంగా కొంతమందిని జనసేన పార్టీ క్యాంపెనర్లుగా ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన పిఠాపురం నియోజకవర్గంలో పర్యటన చేశారు. ఈ పర్యటన అనంతరం హైపర్ ఆది మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఈ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ.. పిఠాపురం ప్రచార కార్యక్రమాలలో తాము పాల్గొన్నమని అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ కి మా ఓటు అంటూ ప్రజలందరూ కూడా ఏక కంఠంతో పలుకుతున్నారని తెలిపారు. ఎన్నికలు జరగకముందే పవన్ కళ్యాణ్ గెలుపు పిఠాపురంలో ఖాయమైందని హైపర్ ఆది వెల్లడించారు.

ఇక తాము పిఠాపురంలో మాత్రమే కాకుండా మిగిలిన జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాలలో కూడా పర్యటనలు చేస్తామని వెల్లడించారు. ఇక పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ నిధుల కోసం ఎదురుచూసే వ్యక్తి కాదు ఆయన తన సొంత డబ్బుతోనే తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు. ప్రస్తుతం మనం హైదరాబాదు చూడటానికి ఎలా వెళ్తున్నామో పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అయిన తర్వాత అదే విధంగా ఇక్కడ చూడటానికి వస్తారని ఆది తెలిపారు.

ఇక వైసిపి ప్రభుత్వం ఎంత మంది నాయకులను మంత్రులను రంగంలోకి దింపిన పవన్ కళ్యాణ్ గెలుపును మాత్రం ఆపలేరని తెలిపారు. ఇక తాము ఈ నెల రోజులకు సరిపోయే షూటింగ్స్ అన్నీ కూడా పూర్తి చేసుకున్నామని ఈ నెల రోజులు ఎలాంటి షూటింగ్స్ కి కూడా తాము పాల్గొనమని ఎలక్షన్స్ తర్వాతే తిరిగి షూటింగ్స్ ఉంటాయంటూ హైపర్ ఆది ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.https://telugu.chitraseema.org/yash-plays-dual-role-as-actor-and-producer-in-the-epic-ramayana/

 

ట్రెండింగ్ వార్తలు