నాగ చైతన్య కస్టడీ రిలీజయ్యేది ఎప్పుడంటే?

February 26, 2023

నాగ చైతన్య కస్టడీ రిలీజయ్యేది ఎప్పుడంటే?

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ద్విభాషా చిత్రం ‘కస్టడీ.  ఈ చిత్రం షూటింగ్ పుర్తయింది. దర్శకుడు వెంకట్ ప్రభు కట్ చెప్పి.. ‘’చైతు మా కస్టడీ నుంచి ఇక నీకు విడుదల’ అని చెప్పగా.. ‘మీ అందరినీ మే 12న కస్టడీలోకి తీసుకుంటాం. థియేటర్ లో కలుద్దాం’ అని నాగచైతన్య, కృతి శెట్టి చెప్పడం ఆకట్టుకుంది.

ఈ ఈ చిత్రంలో అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాగ చైతన్య కెరీర్‌లో అత్యంత ఖరీదైన చిత్రాల్లో కస్టడీ ఒకటి. అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా రూపొందుతోంది. మాస్ట్రో ఇళయరాజా, లిటిల్ మాస్ట్రో యువన్ శంకర్ రాజా కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని పవన్‌కుమార్‌ సమర్పిస్తున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్‌ రాస్తుండగా, ఎస్‌ఆర్‌ కత్తిర్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు