పెళ్లి కాలేదు కానీ పిల్లల కోసం ఆ పని చేసిన నటి మెహ్రీన్!

May 1, 2024

పెళ్లి కాలేదు కానీ పిల్లల కోసం ఆ పని చేసిన నటి మెహ్రీన్!

ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి సెలబ్రిటీలు లేదంటే అమ్మాయిలు జీవితంలో బాగా సెటిల్ అయిన తర్వాతనే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా ఇంకా బాగా సంపాదన వచ్చిన తర్వాత పిల్లలను ప్లాన్ చేస్తున్నారు అయితే 30 దాటిన తర్వాత పిల్లలు కావాలి అంటే చాలా కష్టమని చెప్పాలి. ఒకవేళ జన్మించిన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో జన్మిస్తూ ఉంటారు అందుకే చాలామంది యుక్త వయసులో ఉన్నప్పుడే ఎగ్ ఫ్రీజింగ్ చేయడం వల్ల మనం ఎప్పుడు పిల్లలని కావాలి అనుకుంటే అప్పుడు ఆ ఎగ్ ద్వారా పిల్లలను పొందవచ్చు.

ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఎంతోమంది హీరోయిన్లు ఇలా ఎగ్ ఫ్రీజింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సాధారణ ప్రజలకు ఇది చాలా ఆశ్చర్యకరంగా అనిపించినప్పటికీ సెలబ్రిటీలకు మాత్రం ఎగ్ ఫ్రీజింగ్ అనేది సర్వసాధారణమైందని చెప్పాలి. ఇక మెగా కోడలు ఉపాసన సైతం ఎగ్ ఫ్రీజింగ్ ద్వారానే పిల్లలని కన్న విషయం మనకు తెలిసిందే.

అయితే ఇటీవల నటి మృణాల్ ఠాకూర్ సైతం తాను కూడా ఎగ్ ఫ్రీజింగ్ ఆలోచనలో ఉన్నానని తెలియజేశారు. అయితే తాజాగా మరో నటి సైతం పెళ్లి కాకుండానే పిల్లల కోసం ఎంతో తాపత్రయపడుతూ ముందుగానే తన ఎగ్ ఫ్రీజ్ చేసి పెట్టారు. ప్రస్తుతం అందుకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇందుకు సంబంధించిన వీడియోని షేర్ చేసినటువంటి ఈమె ఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియకు వెళ్లాలా? వద్దా? అని చాలా ఆలోచించాను.. నా మనసును సిద్దం చేసుకోవడానికి 2 సంవత్సరాలు పట్టింది.. చివరికి నేను దీన్ని ఎంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఇలాంటి వ్యక్తిగతమైన విషయాలు సోషల్ మీడియాలో పంచుకోవాలా? వద్దా అని కూడా ఆలోచించాను. నాలాంటి చాలా మంది మహిళలు ఉన్నారని నేను అనుకున్నాను. వారు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి? లేదా బిడ్డను కనాలి? అని ఇంకా నిర్ణయించుకుని ఉండరు.. అయితే ఫ్యూచర్ కోసం, భవిష్యత్తులో వచ్చే సంక్లిష్టతలను నివారించడానికి అందరు స్త్రీలు దీన్ని అనుసరించడం ఉత్తమమని తెలిపారు. ఇలా ఈమె ఎగ్ ఫ్రీజింగ్ కి సంబంధించిన వీడియోని షేర్ చేయడమే కాకుండా ఈ విషయం గురించి అందరిలో అవగాహన కల్పిస్తూ ఈ వీడియోని షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

Read More: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్టుపై క్రేజీ అప్డేట్.. సంతోషంలో ఫ్యాన్స్!

Related News

ట్రెండింగ్ వార్తలు