May 1, 2024
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల తన సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నటించిన RRR సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈయన తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. అయితే మొదటి భాగం ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కేవలం షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ సినిమాని అక్టోబర్ 10 వ తేదీకి వాయిదా వేశారు. ఇక ఈ సినిమాలతో పాటు ఎన్టీఆర్ బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఎన్టీఆర్ కే జి ఎఫ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో కూడా సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజానికి ఈ సినిమా షూటింగు ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా ప్రశాంత్ తన ఇతర సినిమా పనుల వల్ల కాస్త ఆలస్యమైంది. అయితే ఈ సినిమా అక్టోబర్ నుంచి మొదలు కాబోతుందని తెలుస్తుంది. అప్పటికి దేవర సినిమా పనులు పూర్తి కావడంతో ఎన్టీఆర్ ప్రశాంత్ సినిమాతో బిజీ కాబోతున్నారని సమాచారం అంతేకాకుండా ముందుగా అనుకున్న దానికంటే ఈ సినిమాను మరింత రిచ్ గా డిజైన్ చేశారని విషయం తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈ సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
Read More: కుబేర నుంచి నాగార్జున ఫస్ట్ లుక్… క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్!