May 1, 2024
కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతున్న సంగతి తెలిసిందే .ఇటీవల నా సామిరంగా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి నాగార్జున త్వరలోనే కుబేర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్నటువంటి కుబేర సినిమాలో నాగార్జున కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ సినిమా నుంచి ధనుష్ లుక్ కి సంబంధించిన గ్లింప్ వీడియోని విడుదల చేసారు. ఈ వీడియో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి. ఇకపోతే ఈ సినిమాలో నటిస్తున్నటువంటి నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్ త్వరలోనే విడుదల కానున్నట్టు మేకర్ అధికారికంగా ప్రకటించారు. నాగార్జున ఫస్ట్ లుక్ ని మే 2న రివీల్ చేయబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసారు.
ఇకపోతే ఈ సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్ ఐపిఎల్ లో భాగంగా మే 2న సాయంత్రం జరుగనున్న హైదరాబాద్ vs రాజస్థాన్ మ్యాచ్ లో సాయంత్రం 6 గం. లకు ప్రత్యేకంగా రివీల్ చేయనున్నారు. అనంతరం అధికారికంగా ప్రకటించబోతున్నట్లు మేకప్ వెల్లడించారు. దీంతో నాగార్జున అభిమానులు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ గురించి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్న నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు గ్రాండ్ గా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా పాన్ ఇండియన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.
KING @IamNagarjuna’s FIRST LOOK
— Kubera Movie (@KuberaTheMovie) April 30, 2024
on May 2nd on @StarSportsTEL ❤️🔥#SekharKammulasKUBERA 💥@dhanushkraja @iamRashmika @sekharkammula @jimSarbh @Daliptahil @ThisIsDSP @SVCLLP @amigoscreation @AdityaMusic @KuberaTheMovie
pic.twitter.com/FvJzqzZ3CF
Read More: బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్.. యానిమేటెడ్ సిరీస్ ప్రకటించిన జక్కన్న!