బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్.. యానిమేటెడ్ సిరీస్ ప్రకటించిన జక్కన్న!

May 1, 2024

బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్.. యానిమేటెడ్ సిరీస్ ప్రకటించిన జక్కన్న!

బాహుబలి ఈ సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించినటువంటి ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విధంగా బాహుబలి సినిమా ద్వారా మన తెలుగు చిత్ర పరిశ్రమ పేరు ప్రఖ్యాతలు కూడా పెరిగిపోయాయి. ఈ సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలోనే మారుమోగుతోంది.

ఇక రాజమౌళి సైతం బాహుబలి సినిమా తర్వాత చేసే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో మాత్రమే కాకుండా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. అయితే వెండితెరపై సంచలనం అయినటువంటి విజయాలను సొంతం చేసుకున్నటువంటి బాహుబలి సినిమా నుంచి ఒక యానిమేటెడ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సిరీస్ కి బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ అని టైటిల్ కూడా ఖరారు చేశారు. ఇక ఈ సిరీస్ గురించి రాజమౌళి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ… మాహిష్మతి ప్రజలు ఆయన పేరు జపించినప్పుడు విశ్వంలోని ఏ శక్తి అతన్ని తిరిగి రాకుండా ఆపలేదు అంటూ రాజమౌళి ఈ సిరీస్ గురించి చేసినటువంటి పోస్ట్ సంచలనంగా మారింది. త్వరలోనే ఈ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ రాబోతుందని తెలుస్తోంది.

ఇలా బాహుబలి నుంచి మరో యానిమేటెడ్ సిరీస్ రాబోతుందనే విషయం తెలియడంతో దీనిపై భారీ స్థాయిలో అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఇక రాజమౌళి తదుపరి సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి అయ్యాయని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుని రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

Read More: తొలిసారి సీమ బ్యాక్ డ్రాప్ లో విజయ్ దేవరకొండ.. భారీగా ప్లాన్ చేస్తున్న రాహుల్!

ట్రెండింగ్ వార్తలు