రీ రిలీజ్ కి సిద్ధమైన ఆరుగురు పతివ్రతలు!

February 1, 2024

రీ రిలీజ్ కి సిద్ధమైన ఆరుగురు పతివ్రతలు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సరికొత్త ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు విడుదల అయ్యి ప్రేక్షకులను అలరించిన సినిమాలతో పాటు అట్టర్ ఫ్లాప్ గా నిలిచిన సినిమాలను కూడా తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరూ సినిమాలను కూడా తిరిగి విడుదల చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాతో మొదలైనటువంటి ఈ రీ రిలీజ్ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

ఇలా మహేష్ బాబుతో మొదలుకొని చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలు అందరూ నటించిన సినిమాలన్నింటిని కూడా ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే మరో సినిమా కూడా తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. మరి రీ రిలీజ్ కాబోతున్నటువంటి ఆ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే ప్రముఖ దివంగత దర్శకుడు సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆరుగురు పతివ్రతలు.

2004వ సంవత్సరంలో తెరకెక్కిన ఈ సినిమా ఒక రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పట్లో ఈ సినిమా సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఇన్ని రోజుల తర్వాత ఈ సినిమా తిరిగి మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అయితే ఈ సినిమాలో చాలా వరకు కొత్త ఆర్టిస్టులు నటించారు. ఈ సినిమాలో మొత్తంగా నలభై రెండు మంది కొత్తవారు నటించారు. చలపతిరావు, ఎల్.బి.శ్రీరామ్‌, శ్రీకృష్ణ కౌశిక్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కమలాకర్ సంగీతాన్నందించారు.

ఇప్పటికే ఎన్నో సినిమాలు తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి తరుణంలో చాలామంది సోషల్ మీడియా వేదికగా ఆరుగురు పతివ్రతలు సినిమాని కూడా తిరిగి విడుదల చేయాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ఫిబ్రవరి 6వ తేదీకి విడుదల అయ్యి ఏకంగా 20 సంవత్సరాలను పూర్తి చేసుకుంటుంది ఈ తరుణంలోనే ఈ సినిమాని కూడా ఫిబ్రవరి 6వ తేదీ తిరిగి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. అయితే ఇంకా ఈ సినిమా రీ రిలీజ్ డేట్ మాత్రం అధికారకంగా వెల్లడించలేదు.

Read More: విశ్వంభర కోసం భారీగా కష్టపడుతున్న మెగాస్టార్.. వైరల్ అవుతున్న వర్కౌట్స్ వీడియో!

Related News

ట్రెండింగ్ వార్తలు