దేశం కానీ దేశంలో “దేవర” సాంగ్.. అప్డేట్ ఇచ్చిన అనిరుద్..

May 10, 2024

దేశం కానీ దేశంలో “దేవర” సాంగ్.. అప్డేట్ ఇచ్చిన అనిరుద్..

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాహ్నవీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా రాబోతుందన్న విషయం అందరికీ తెలిసిందే. రెండు భాగాలుగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమాలో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ రేంజ్ పాన్ ఇండియా వైడ్ గా ఒక రేంజ్ లో పెరిగిపోయింది. ఎన్టీఆర్ తర్వాత ప్రాజెక్ట్ ఏంటా అని ప్రతి ఒక్కరూ వెయ్యి కన్నులతో ఎదురుచూస్తున్నారు.

అప్పుడే దేవర అనే ప్రాజెక్టు వస్తుంది అని ప్రకటించారు చిత్ర బృందం. దేవర సినిమా రిలీజ్ డేట్ ని విడుదల చేసిన చిత్ర బృందం చాలా రోజుల వరకు సినిమాలో ఇంకే అప్డేట్ విడుదల చేయకపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అవుతున్నారు. ఎన్టీఆర్, జాహ్నవీ కపూర్ ల ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన తరువాత మంచి రెస్పాన్స్ రావడంతో కొన్ని రోజులకే దేవర గ్లింప్స్ ని రిలీజ్ చేశారు చిత్ర బృందం.

అందులో ఎన్టీఆర్ లుక్స్ కి, విజువల్స్ కి ఫ్యాన్స్ అందరూ ఫిదా అయిపోయారు. తర్వాత అప్డేట్ ఏంటా అనుకుంటున్న ఫ్యాన్స్ కి నిన్న రాత్రి దేవర మూవీ మేకర్స్ ద మోస్ట్ అవైటెడ్ అనిరుద్-ఎన్టీఆర్ కాంబోలో ఫస్ట్ సింగిల్ అతి త్వరలోనే రిలీజ్ అవ్వబోతుంది అని ప్రకటించారు. దీనికి కారణం అనిరుద్. ఈమధ్య అనిరుద్ విదేశాలలో కాన్సర్ట్ చేస్తూ ఆస్ట్రేలియాలో ఒక కాన్సెర్ట్ లో పెద్ద స్టేజ్ మీద ఎన్టీఆర్ తో దేవర ఫస్ట్ సింగిల్ త్వరలోనే రాబోతుంది అని చెప్పారు.

ఇంక ఆ మాటలకి అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 10 విడుదల అవ్వబోతున్న ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. అంతకుమించి రాక్ స్టార్ అనిరుద్-ఎన్టీఆర్ కాంబో ఎలా ఉంటుందో అని మ్యూజిక్ ఫ్యాన్స్ అందరూ ఆరాటపడుతున్నారు. మరి ఆ సింగిల్ ఎప్పుడు విడుదలవుతుందో చూడాలి.

Read More: కన్నప్ప సినిమాపై ఆసక్తి రేపుతున్న ప్రభాస్ పోస్టర్.. విష్ణు గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు గా!

ట్రెండింగ్ వార్తలు