కన్నప్ప సినిమాపై ఆసక్తి రేపుతున్న ప్రభాస్ పోస్టర్.. విష్ణు గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు గా!

May 10, 2024

కన్నప్ప సినిమాపై ఆసక్తి రేపుతున్న ప్రభాస్ పోస్టర్.. విష్ణు గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు గా!

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ ఇండియన్ చిత్రం కన్నప్ప. ఈ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సినిమా తీయడం కోసం ఆలోచిస్తున్నారని మంచు విష్ణు చాలాసార్లు మీడియాతో చెప్పారు. ఈ సినిమాకి ముఖేష్ సింగ్ దర్శకత్వం వహించడం తో ఈ సినిమాలో మిగిలిన పాత్రలు ఎవరు పోషిస్తున్నారా అని ఆసక్తులు చాలానే వచ్చాయి.

ఎప్పటికప్పుడు మంచు విష్ణు సినిమా అప్డేట్ లను సోషల్ మీడియా ద్వారా ఇస్తూనే ఉన్నారు. ప్రభాస్ ఈ సినిమాలో అతిధి పాత్ర చేస్తున్నారనే వార్తలు రావడంతో ఏ పాత్ర చేస్తున్నారనే సందేహాలు చాలా వచ్చాయి. శివుడి పాత్ర చేస్తున్నారు అని కొన్ని రూమర్స్ వచ్చాయి కానీ దాని తర్వాత అక్షయ్ కుమార్ కూడా ఈ సినిమాలో ఉన్నారు అని తెలియడంతో అక్షయ్ కుమార్ శివుడి పాత్ర చేస్తూ, నందీశ్వరుడు గా ప్రభాస్ నటిస్తున్నారు అనే అందరూ నమ్మారు.

కానీ తాజాగా విడుదల చేసిన ప్రభాస్ పోస్టర్ చూస్తుంటే అది శివుని పాత్ర అని తెలుస్తుంది. ఆ పోస్టర్ విడుదలతో ప్రభాస్ సినిమాలో ఉన్నారని కన్ఫామ్ చేస్తూ ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ని పెంచుతున్నారు మంచు విష్ణు. ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ ని కొత్త కొత్త పాత్రలలో చూడాలనుకుంటున్నారు. అందులో శివుడి పాత్ర కూడా ఒకటి.

మరి శివుడి పక్కన పార్వతీదేవి పాత్రలో ఎవరు నటిస్తున్నారో ఈ సినిమాలో మిగిలిన పాత్రలు పోషించేది ఎవరో అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే అప్డేట్స్ అన్ని వస్తాయి అని మంచు విష్ణు చెప్పారు. సినిమాలో నటిస్తున్న నటులను చూస్తే వీళ్ళేదో పెద్దగానే ప్లాన్ చేసి హిట్టు కొడుతున్నారు అని అనిపిస్తుంది. ఇప్పటికైనా మంచు విష్ణు కి కన్నప్ప సినిమా ద్వారా హిట్ లభించగలడా లేదా అనేది తెలియాల్సి ఉంది మరి.

Read More: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వచ్చేది అప్పుడే?

ట్రెండింగ్ వార్తలు