బాలీవుడ్ లో రష్మిక కి మరొక బంపర్ ఆఫర్.. ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రకటన!

May 10, 2024

బాలీవుడ్ లో రష్మిక కి మరొక బంపర్ ఆఫర్.. ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రకటన!

పుష్ప 2 సినిమా ద్వారా మన ముందుకి రావడానికి సిద్ధంగా ఉన్న రష్మిక ట్విట్టర్ ద్వారా తన అభిమానులకి ఒక గుడ్ న్యూస్ షేర్ చేసింది.బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరో గా నటిస్తున్న సికిందర్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది ఈ భామ. ఈ సినిమాకి ఏ ఆర్ మురుగదాస్ దర్శకుడు. సికిందర్ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న పేరుని గురువారం మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

రష్మిక మందన్న ఆన్ స్క్రీన్ మ్యూజిక్ ని 2025 ని థియేటర్లలో చూడటం కోసం ప్రేక్షకులతో పాటు తాము కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం అంటూ ట్వీట్ చేసింది మూవీ టీం. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా రష్మిక కూడా తన అభిమానులతో తన సంతోషాన్ని షేర్ చేసుకుంది.

తన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఏదని చాలా రోజులుగా అందరూ అడుగుతున్నారు, వారికి నేను ఇవ్వబోతున్న సర్ప్రైజ్ ఇదే. సికిందర్ సినిమాలో భాగం కావడం గర్వంగా ఉందని, త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుందని ట్వీట్ చేసింది రష్మిక. అయితే ఈ విషయంపై నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్, రష్మిక ల మధ్యన 30 ఏళ్ల ఏజ్ డిఫరెన్స్ ఉందంటున్నారు కొందరు.

ఓల్డ్ సల్మాన్, యంగ్ రష్మిక అంటూ మరికొందరు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇక రష్మిక ఇతర సినిమాల విషయానికి వస్తే పుష్ప టు సినిమాలో శ్రీవల్లి పాత్రలో రష్మిక కనిపిస్తుంది. ఈ సినిమా 2024 ఆగస్టు 15 న విడుదలకు సిద్ధంగా ఉంది, అంతేకాకుండా యానిమల్ కి సీక్వెల్ గా వస్తున్న సినిమాలో కూడా నటిస్తుంది రష్మిక. అంతేకాకుండా గర్ల్ ఫ్రెండ్ అనే ఒక ఫిమేల్ ఓరియంటెడ్ మూవీలో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది నేషనల్ క్రష్ రష్మిక.

Read More: దేశం కానీ దేశంలో “దేవర” సాంగ్.. అప్డేట్ ఇచ్చిన అనిరుద్..

ట్రెండింగ్ వార్తలు