విశ్వంభర కోసం భారీగా కష్టపడుతున్న మెగాస్టార్.. వైరల్ అవుతున్న వర్కౌట్స్ వీడియో!

February 1, 2024

విశ్వంభర కోసం భారీగా కష్టపడుతున్న మెగాస్టార్.. వైరల్ అవుతున్న వర్కౌట్స్ వీడియో!

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తే కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటుడిగా వరుస సినిమాలకు కమిట్ అవుతున్నటువంటి చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటించబోతున్న సంగతి మనకు తెలిసిందే.

గత కొద్ది రోజుల క్రితమే పూజా కార్యక్రమాలను ప్రారంభించినటువంటి ఈ సినిమా ఇటీవల సంక్రాంతి పండుగను పురస్కరించుకొని టైటిల్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే చిరంజీవి విశ్వంభర సినిమా కోసం తనని తాను సిద్ధం చేసుకుంటూ ఉన్నారు.

తాజాగా ఈ సినిమా కోసం ఈయన భారీగా కష్టపడుతూ పెద్ద ఎత్తున వర్కౌట్స్ చేస్తూ ఉన్నటువంటి ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో భాగంగా ఈయన ఫిట్నెస్ కోసం ఎన్నో రకాల వర్కౌట్స్ చేస్తూ కనిపించారు. ఇక ఈ వీడియో చివరిలో గెట్టింగ్ రెడీ ఫర్ విశ్వంభర అంటూ చిరు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇవి క్రియేషన్ బ్యానర్ పై డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి ఈ సినిమా పట్ల అభిమానులలో కూడా భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా చిరంజీవి మోకాలు సర్జరీ కారణంగా కొంతకాలం పాటు బ్రేక్ ఇచ్చారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభించి వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. మెగా ఫాంటసీ అడ్వెంచర్ జాన‌ర‌ల్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది.

Read More: మహేష్ రాజమౌళి సినిమాలో నాగార్జున?

ట్రెండింగ్ వార్తలు