పవన్ కళ్యాణ్ కోసం బరిలోకి దిగిన నిర్మాత నాగ వంశీ.. గడప గడపకు ప్రచారం

May 9, 2024

పవన్ కళ్యాణ్ కోసం బరిలోకి దిగిన నిర్మాత నాగ వంశీ.. గడప గడపకు ప్రచారం

ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు వేడివేడిగా సాగుతున్నాయి. మరి కొద్ది రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో నువ్వా నేనా అన్నట్టుగా రాజకీయాలు సాగుతున్నాయి. ఇప్పటికే జనసేన టీడీపీ, వైసీపీ లాంటి పార్టీలు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే పవన్ కళ్యాణ్ ఈసారి ఎలా అయినా గెలవాలి అని పట్టుదలతో ఉన్నారు. ఈసారి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇక పవన్ కళ్యాణ్ కి మద్దతుగా టీడీపీ నాయకులు జనసేన నాయకులతో పాటు అభిమానులు చాలామంది సెలబ్రిటీలు మద్దతుగా నిలిచారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన్న అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ పిఠాపురంలో ప్రచారం నిర్వహించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా తన తమ్ముడు పవన్‌ను గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరుతూ ప్రత్యేక వీడియోను రీసెంట్‌గా రిలీజ్ చేశారు.

కేవలం వీరు మాత్రమే కాకుండా జబర్దస్త్ ఆర్టిస్టులు గెటప్ శీను, సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్ సహా పలువురు నటీ నటులు పవన్ తరఫున పిఠాపురంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఈ లిస్టులో యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ కూడా చేరారు. పవన్ కళ్యాణ్‌ను పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ నాగ వంశీ పిఠాపురంలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ పాంప్లెట్స్ పంచిపెడుతూ పవన్‌కి ఓటేయాలని నాగ వంశీ కోరారు. ఆయనతో పాటు తన టీమ్ కూడా ప్రచారంలో పాల్గొంది. ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు.

Read More: ఆ ఆలయంలోనే అర్జున్ కుమార్తె ఐశ్వర్య వివాహం.. ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

ట్రెండింగ్ వార్తలు