పెళ్లికి సిద్ధమైన బర్రెలక్క.. వరుడు ఎవరో తెలుసా?

March 22, 2024

పెళ్లికి సిద్ధమైన బర్రెలక్క.. వరుడు ఎవరో తెలుసా?

సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులర్ అయినటువంటి వారిలో బర్రెలక్క ఒకరు. ఈమె గత కొద్ది రోజుల క్రితం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి మనకు తెలిసిందే. తనకు ఉద్యోగం రాకపోవడంతో బర్రెలు కాస్తున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా ఈమె షేర్ చేసినటువంటి వీడియో సంచలనంగా మారింది. అప్పటినుంచి ఎన్నో రకాల రీల్స్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు.

ఇలా సోషల్ మీడియాలో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి బర్రెలక్క అలియాస్ శిరీష గత అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా స్వాతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇలా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిపోయినటువంటి ఈమె తిరిగి యధావిధిగా తన రీల్స్ చేసుకుంటూ అభిమానులను సందడి చేస్తున్నారు. అయితే తాజాగా ఈమె శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు.

త్వరలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నాను అనే గుడ్ న్యూస్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తనకు ఇటీవల నిశ్చితార్థం జరిగిందని తెలిపారు. నిశ్చితార్థం అనుకోకుండా జరగడంతో ఎవరికి చెప్పలేక ఎవరిని ఆహ్వానించలేకపోయానని తెలిపారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నానని పెళ్లికి సంబంధించిన షాపింగ్ చేస్తున్న వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలా పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పారు కానీ వరుడు ఎవరు అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు.

గతంలో ఈమె పెళ్లి చేసుకుందని భర్తకు విడాకులు ఇచ్చిందంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే. కానీ అవన్నీ కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వారికి అనుగుణంగా ఉండడం కోసం తన తండ్రికి డబ్బులు ఇచ్చి ఇలాంటి వేషాలు వేయించారు అంటూ ఈమె ఆ వార్తలను పూర్తిగా సాక్షాలతో సహా బయటపెట్టి ఖండించిన సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే ఈమె పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం తెలిసి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read More: శరీరాన్ని విల్లులా వంచేసిన రష్మిక. వర్కౌట్స్ మామూలుగా లేవుగా?

Related News

ట్రెండింగ్ వార్తలు